#OshoRajanish : ఓషో..కోట్లాది భక్తుల ఆరాధకుడు..మన కాలపు మానవుడు
ప్రపంచమంతటా కేవలం తన ప్రతిభ ఆధారంగానే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించిన తాత్వికుల్లో ముందు వరుసలో నిలిచిన వ్యక్తి ..తాత్వికుడు, మేధావి ఓషో. జీవితమంతా సంచారం చేస్తూనే వేలాది పుస్తకాలను అధ్యయనం చేస్తూనే తానే ఓ అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థగా ఎదిగిన వ్యక్తి ఆయన.
లోకాన్ని ఆవిష్కరించిన వ్యక్తుల్లో ఎందరో ప్రతిభావంతులు వున్నారు. మరికొందరు తాత్వికులుగా, తత్వవేత్తలుగా, మార్గదర్శకులుగా, స్ఫూర్తి దాయకంగా, యోగులుగా నిలిచి పోయారు. కానీ వీటన్నింటికంటే ఎక్కువగా ప్రపంచమంతటా కేవలం తన ప్రతిభ ఆధారంగానే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించిన తాత్వికుల్లో ముందు వరుసలో నిలిచిన వ్యక్తి ..తాత్వికుడు, మేధావి ఓషో. జీవితమంతా సంచారం చేస్తూనే వేలాది పుస్తకాలను అధ్యయనం చేస్తూనే తానే ఓ అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థగా ఎదిగిన వ్యక్తి ఆయన. కేవలం 59 ఏళ్ల పాటు మాత్రమే ఆయన ఈ భూమి మీద నిలిచి ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించి పెట్టారు. ఇపుడు ఓషో అన్నది ఒక వ్యక్తికి చెందిన పదం కాదు..అదో అంతర్వాణి..అంతే కాదు..జీవితంతో..ప్రపంచంతో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన సాధనం.
ప్రతి రంగానికి చెందిన వేలాది మంది ఆయన అంటే పడి చచ్చేవాళ్లున్నారు. మనం ఆరాధించే వాళ్లు..మనతో పాటే ఎదిగిన వాళ్లు..ఇలా తమను తాము ఆయనను గురువుగా స్వీకరించారు. ఆయన పేరును ఉచ్చరించడమే ఓ బ్రాండ్ గా, ఓ ఇమేజ్ గా భావించిన వాళ్లు కోట్లల్లో ఉన్నారు. ఆయన భౌతికంగా లేక పోవచ్చు..కానీ ఓషో ఇజం ఇప్పటికీ మనతో పాటు తోడుగా ఉంటుంది. ఇంతకంటే వదిలించు కోలేం. ఓషో భావ జలధారలో కొట్టుకు పోయిన వాళ్లు ఎందరో. తమను తాము ఆవిష్కరించుకుని..నగ్నంగా నడి వీధుల్లో సంచరించిన వాళ్లు లెక్కించ లేనంతగా ఉన్నారు. ఆ భావ పరంపరను చూసి తట్టుకోలేక సామాజిక కట్టుబాట్లు ఏర్పాటు చేసిన దేశాలున్నాయి. అంతకంటే ఎక్కువగా ప్రపంచాన్ని శాసించే పెద్దన్న సైతం ఓషోను చూసి భయపడింది.
మిలియనీర్స్, ట్రిలియనీర్స్..ఇలా ప్రపంచమంతటా విస్తరించిన ధనవంతుల సమూహమంతా ఓషోను స్వీకరించారు. ఓషోను శ్వాసగా మార్చుకున్నారు. ఎవరీ ఓషో..ఎందుకు యుఎస్ లాంటి అగ్ర దేశాలు భయపడ్డాయి. ఆయుధాలకంటే తాత్వికతతో కూడిన భావధార భయపెట్టిందా. ఏమో ఈ భారతీయుడు కొద్ది కాలంలోనే ప్రభావితం చేస్తూ వచ్చారు. తనకంటూ ఓ మార్గాన్ని..లోకానికి దిశా నిర్దేశనం చేసే స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికీ ఓషో రాసి ప్రవచించిన భావావేశమంతా పుస్తకాల్లో పొందు పరిచారు. అవి ఇపుడు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఎంతగా అంటే కోట్లల్లో. మనిషిని చంప గలిగారు..కానీ ఆలోచనలను చంపలేరంటూ ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నదే. ఏ కాలానికైనా పనికి వచ్చే ప్రతి సందర్భానికి తగ్గట్టుగానే ఓషో ముందు జాగ్రత్తగా వివరిస్తూ వచ్చారు. రజనీష్ అనే వ్యక్తి ఓషో గా ఎలా మారారు. ఎందుకు ఇంతగా ప్రభావితం చేస్తూ వస్తున్నారు.
టెక్నాలజీ మారినా..లేక అప్ డేట్ అయినా..రాకెట్ కంటే వేగంగా విస్తరించినా ఇంకా ఓషో మనల్ని ఎందుకు వెంటాడుతున్నాడు అంటే ఆయన చెప్పిన దాంట్లో నిజం వుంది..సత్యం వుంది కనుక. మానవ సమూహం గతి శీలతను కుండ బద్దలు కొట్టినట్లు బయట పెట్టారు కనుక. బయటకు కొందరు ఓషో ను అంగీకరించక పోవచ్చు..కానీ అంతర్లీనంగా ఆయనంటే ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఓషో గురించి చెప్పాల్సి వస్తే..ఆయన అసలు పేరు రజినీష్ చంద్రమోహన్ జైన్ డిసెంబరు 11, 1931 లో పుట్టారు. జనవరి 19, 1990 లో ఈ లోకాన్ని వీడారు. 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా మారారు. భారతీయ ఆధ్యాత్మిక బోధకుడిగా ఎదిగారు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించాడు. ఓషో మూవ్‌మెంట్ పేరుతో వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు.
మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడా ఆయన స్వస్థలం. ఎరుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం, సెక్స్, సమాధి ..ఇవన్నీ వదిలి వేయలేని జీవితానికి సంబంధించిన విలువలంటూ స్పష్టం చేశారు ఈ యోగి. ఆయన ఎక్కువగా జ్ఞానోదయం గురించి ప్రచారం చేశారు. మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని ఆయన అన్నాడు. హిందీ, ఆంగ్ల భాషలలో ఆయన అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు, సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, యోగ సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో ఆయన ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ ఆలోచనా పద్ధతిలో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని ఆయన ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు ఆయన్ని సెక్స్ గురువు అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని సంభోగం నుంచి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో పుస్తకంగా వచ్చింది. ఆయన చెప్పినది, తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్య సహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని పేర్కొన్నారు. ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచి పెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి. జీవితం పక్షి. ప్రేమ, స్వేచ్చ రెండు రెక్కలు. అందరూ మనల్ని వదిలి వేయటం ఒంటరితనం. అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం అన్నారు ఓషో.
పూణేలో ఓషో అంతర్జాతీయ ధ్యాన విహారం పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకే సారి 2 లక్షల మందికి పైగా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక ఆరామాలలో ఒకటిగా పేరొందింది. ఆయన రాసిన పుస్తకాలు 50 భాషలలో అనువాదం చేయబడ్డాయి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ నవలాకారుడు కుష్వంత్ సింగ్, సినిమా నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా, అమెరికా కవి రూమీ, అనువాదకుడు కోల్‌మన్ బార్క్స్, అమెరికా నవలాకారుడు టామ్ రాబిన్స్, తదితరులు ఓషోకు ప్రేమికులుగా ఉన్నారు. ఇదిలా ఉండగా భారత పార్లమెంటు గ్రంథాలయంలో కేవలం ఇద్దరు ప్రముఖుల పూర్తి జీవితకాల రచనలను మాత్రమే పొందు పరిచారు. అందులో ఒకరు ఓషో కాగా మరొకరు మహాత్మా గాంధీ ఉండడం రజనీష్ కు ఉన్న గుర్తింపు ఇది.
No comment allowed please