#OsmaniaUniversity : అభివృద్ధికి ఆమడ దూరం ఉస్మానియాపై ఎందుకంత కోపం
ప్రపంచానికే పాఠం నేర్పిన ఉస్మానియా
Osmania University : ఈ దేశంలో సామాజిక చైతన్యం కలిగిన యూనివర్సిటీస్ లలో మొదటి పేరు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University). ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు దిక్కులేనిదైంది. తాజాగా వందేళ్ల ఉత్సవం జరుపుకున్నా కనీస వసతులకు నోచుకోని దుస్థితికి దిగజారి పోయింది. నిత్య చైతన్యానికి, జీవన పోరాటానికి ప్రతీకగా ఉన్న ఈ చదువుల తల్లి ఇప్పుడు ఆసరా కోసం వేచి చూస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది. వేలాది మంది చైతన్యం కలిగిన విద్యార్థులు, తెలంగాణ ప్రాంతపు బిడ్డలు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. ఖాకీల దాస్టికానికి బలై పోయారు. ఇంకొందరు నామ రూపాలు లేకుండా పోయారు.
ఈ దేశపు అభివృద్ధిలో, పునర్ నిర్మాణంలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారంతా ఈ ఉన్నత విద్యాలయం నుంచి వచ్చిన వారే. ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసిన ఘనత ఇక్కడ,.ఈ నాలుగు గోడల మధ్యన చదువుకున్న వారిదే. జాతికి జీవగర్రలాగా మారిన చరిత్రను స్వంతం చేసుకున్నది ఇక్కడే. పోరాటాలకు, ఆరాటాలకు నెలవై పాటలకు, కవితలకు ప్రాణం పోసుకున్నది ఈ జాగాలోనే. ఎంత చెప్పినా తక్కువే . ఒక ఏడాది కాదు ఒక దశాబ్డం పడుతుంది ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే . ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి ..అక్కడ ఎవరో ఒకరు ఈ యూనివర్సిటీలో చదువుకున్న వారై ఉంటారు. అంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు

No comment allowed please