Owaisi Gaddar : గద్దర్ పేదల గొంతుక – ఓవైసీ బ్రదర్స్
అన్నదమ్ముల నివాళి
Owaisi Gaddar : ఒక శకం ముగిసింది. ఒక గొంతుక మూగ బోయింది. కొన్నేళ్లుగా తన ఆట, పాటలతో, మాటల తూటాలతో ప్రభావితం చేస్తూ వచ్చిన ప్రజా యుద్ద నౌక గద్దర్ మరణం బాధాకరం. ఇది యావత్ తెలంగాణ సమాజానికే కాదు భారత దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi).
Owaisi Gaddar Voice was Muffled
ట్విట్టర్ వేదికగా తాము గద్దర్ తో కలిసి నడిచిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్బంగా 2017లో తామిద్దరం కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ మృతి తెలంగాణ అణగారిన వర్గాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. సమస్త పేదలకు , అణగారిన , మైనార్టీలకు ఒక గొంతుకగా నిలిచిన గద్దర్ లేక పోవడం బాధాకరమని వాపోయారు.
ఆయన చిరస్థాయిగా నిలిచే ఉంటారని, తన పాటలతో ఎల్లప్పటికీ మనల్ని తడుముతూనే ఉంటారని ప్రశంసించారు. మా దివంగత తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీని కొన్ని సందర్భాలలో కలిశాడు. ఆయన పాటలు ప్రజలలో విప్లవ స్పూర్తిని ప్రేరేపించాయని కొనియాడారు. గద్దర్ లాంటి వ్యక్తి ఈ తరంలో కాదు వచ్చే తరంలో కూడా పుట్టరంటూ పేర్కొన్నారు అసదుద్దీన్, అక్బరుద్దీన్.
Also Read : Pawan Kalyan Gaddar : ప్రజా యుద్దనౌకకు సలాం – పవన్