Owaisi Amit Shah : అమిత్ షాపై ఓవైసీ క‌న్నెర్ర‌

ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తాం

కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. చేవెళ్ల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ఏసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే రాష్ట్రంలో మైనార్టీల‌కు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని తీసి వేస్తామ‌ని హెచ్చ‌రించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగారు ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ.

ముస్లింలు ఈ దేశంలో భాగం కారా అని ప్ర‌శ్నించారు. ముస్లిం కోటాను ర‌ద్దు చేస్తానంటూ కేంద్ర మంత్రిగా ఎలా ప్ర‌క‌టిస్తారంటూ నిల‌దీశారు ఓవైసీ. మ‌త ఆధారిత రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగానికి విరుద్దం ఎలా అవుతుందంటూ మండిప‌డ్డారు. త‌మ పార్టీ గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే వెంట‌నే రిజ‌ర్వేషన్ సౌక‌ర్యాన్ని ఎత్తి వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

4 శాతం ముస్లిం కోటాను తొల‌గిస్తామ‌ని, ఇదే స‌మ‌యంలో షెడ్యూల్డ్ కులాలు, తెగ‌లు , ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఆ రిజ‌ర్వేష‌న్ హ‌క్కు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ హ‌క్కు ఎస్సీలు, ఎస్టీలు, బీసీల‌కు మాత్ర‌మే ఉంద‌ని ముస్లింల‌కు లేద‌న్నారు అమిత్ షా. రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్ఎస్ అప‌విత్ర క‌లయిక‌తో అవినీతి, అక్ర‌మాలు రాజ్యం ఏలుతున్నాయంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై తీవ్రంగా ఖండించారు అస‌దుద్దీన్ ఓవైసీ.

Leave A Reply

Your Email Id will not be published!