Owaisi Slams : ఢిల్లీ పోలీసులపై ఓవైసీ ఫైర్
ట్వీట్ చేసిన ఎంఐఎం చీఫ్
Owaisi Slams : వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ దేశంలోని పలువురు నేతలు, జర్నలిస్ట్ సబా నఖ్వీపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై గురువారం స్పందించారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా ఓవైసీ(Owaisi Slams) తో పాటు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ , పూజారి యతి నర్సింహానంద సరస్వతి సోషల్ మీడియాలో వివాదాస్పద సందేశాల విశ్లేషణ తర్వాత వేర్వేరుగా కేసులు మనోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా వరుసగా ట్వీట్లు చేశారు ఓవైసీ. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ స్క్రీన్ షాట్ ను పంచుకున్నారు. తనపై ఏ నేరం కింద కేసు నమోదు చేశారో దానిలో పేర్కొనలేదని ఆరోపించారు.
ఎందుకు, ఏ ప్రాతిపదికన తనపై ఎఫ్ఐఆర్ చేశారో తనకు ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. కనీస సమాచారం లేకుండా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు ఓవైసీ.
యతి, నూపుర్ శర్మ, జిందాల్ , తదితరులపై కేసులు నమోదు చేసినా కొనసాగిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. యతి తన బెయిల్ షరతలును పదే పదే ఉల్లంఘించాడని, ముస్లింపై తన అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడని ఆరోపించారు ఓవైసీ(Owaisi Slams) .
ఓ వైపు ప్రవక్తను బాహాటంగా అవమానించారు. మరో పక్క బీజేపీ మద్దతుదారులను మభ్య పెట్టేందుకు రెండు వైపులా ద్వేష పూరిత ప్రసంగం ఉన్నట్లు అనిపించేలా కేసులు నమోదు చేశారంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు ఓవైసీ.
ఆధారాలు లేకుండా ఇలా ఎలా పడితే అలా కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు హైదరాబాద్ ఎంపీ.
Also Read : రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్