Owaisi : భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో కేంద్రం విఫ‌లం

కాశ్మీరీ పండిట్ల సెక్యూరిటీపై ఓవైసీ ఫైర్

Owaisi : ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్టారు. కాశ్మీరీ పండిట్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో మోదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు.

హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల దృష్ట్యా లోయ‌ను విడిచి పెట్ట‌డ‌మే మంచిద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. మంగ‌ళ‌వారం పోషియాన్ లో ఇద్ద‌రు కాశ్మీరీ పండిట్ బ్ర‌ద‌ర్స్ పై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు.

వీరిలో ఒక‌రు చ‌ని పోయారు. మ‌రొక‌రు చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు ఎంపీ. చాలా బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడారు ఓవైసీ. కేంద్రంపై, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హాపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాశ్మీర్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న బాధాక‌రం. అయితే ఇది పూర్తిగా న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి మ‌రో ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు ఓవైసీ.

జ‌మ్మూ కాశ్మీర్ లో బీజేపీ స‌ర్కార్ ఎల్జీని నియ‌మించింది. కేంద్రంలో న‌డిచే ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో రూఢీ అయ్యింద‌న్నారు.

ఆర్టికల్ 370ని తొల‌గించినా ఎలాంటి మార్పు రాలేద‌న్నారు ఓవైసీ(Owaisi). ఇక్క‌డ కాశ్మీరీ పండిట్ల‌పై దాడి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని గుర్తు చేశారు ఎంపీ.

గ‌తంలో కాదు కాశ్మీరీ పండిట్లు ఇప్పుడే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు. వారికి పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త కేంద్రానికి, మోదీపై ఉంద‌న్నారు అస‌దుద్దీన్ ఓవైసీ.

ఇప్ప‌టి కైనా కేంద్రం మ‌రోసారి ఆలోచించాల‌ని సూచించారు.

Also Read : సామాన్యుడి స్వ‌రం కేజ్రీవాల్ సంత‌కం

Leave A Reply

Your Email Id will not be published!