Juhi Kore : ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ జూహీ కోర్ నోట్ వైరల్
తాత కల నిజమైందంటూ బిగ్ నోట్
Juhi Kore : భారతీయ సంతతికి చెందిన ఆక్స్ ఫర్డ్ విద్యార్థిని జూహీ కోర్(Juhi Kore) ఇప్పుడు వైరల్ గా మారారు. ఆమె తన తాత గురించి రాసిన నోట్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
ఈ నోట్ తో ఆమె సదరు యూనివర్శిటీ నుండి మాస్టర్స్ పట్టా పొందినట్లు ప్రకటించింది. లింక్డ్ ఇన్ లో తన ప్రేరణ గురించి పంచుకున్నారు.
ఇది ఇప్పుడు విస్తృతంగా జనాదరణ పొందింది. హృదయాన్ని కదిలించే నోట్ లో జూహీ కోర్ తన తాత విద్యను పొందడంలో ఎదుర్కొన్న పోరాటాలను , అతని కల ఇప్పుడు ఎలా నిజమైందో వివరించింది.
కంపారిటివ్ సోషల్ పాలిటిక్స్ లో చదివేందుకు సిద్దమయ్యారు. మహారాష్ట్ర లోని అట్టడుగు కుటుంబానికి చెందిన తన తాత చదువుకునే హక్కు కోసం పోరాడాల్సి వచ్చిందని జూహీ పంచుకున్నారు.
1947 లో భారత దేశాన్ని స్వేచ్ఛా , స్వతంత్ర దేశంగా ప్రకటించబడిన సంవత్సరంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా , స్వతంత్రంగా జీవించేందుకు అనుమతించ బడలేదు.
ఆ వ్యక్తులలో ఒకరు మరాఠాలోని ఒక గ్రామీణ గ్రామంలో అత్యల్ప కులానికి చెందిన కుటుంబానికి చెందిన ఒక యువ పాఠశాల వయస్సు కలిగిన
బాలుడు. ఆ కుటుంబం రెండు ప్రాథమిక కారణాల వల్ల బడికి వెళ్లాలని కోరుకోలేదు.
4 సంవత్సరాలలో పెద్ద వాడిగా పొలంలో పని చేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు భయపడ్డారు. విద్యార్థులు, టీచర్లు ఎలా పరిగణిస్తారో మీరే ఆలోచించాలని పేర్కొంది జూహీ కోర్(Juhi Kore).
పాదాలకు చెప్పులు లేకుండా తరగతి గదిలోకి వెళ్లేందుకు అనుమతించ లేదు. అతడి అగ్రవర్ణ తోటివారి నుండి బెదిరింపులు వచ్చాయి. వివక్ష ఉన్నా సంకల్పం ముందు చిన్న పోయింది.
ఇంగ్లీష్ నేర్చుకుని కలల నగరానికి వెళ్లి , న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా చేశారు. ఈ సందర్భంగా తన తాత తనకే
స్పూర్తి అని చెప్పారు జూహీ కోర్. బాధాకరం ఏమిటంటే గత ఏడాది తన తాతను కోల్పోయింది.
Also Read : ప్రీతి జింటా నా ఆల్ టైమ్ ఫేవరేట్