P Chidambaram : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఆయన పలుసార్లు ఏఐసీసీ నేతలతో కలిశారు. ఈ సందర్భంగా బ్లూ ప్రింట్ తయారు చేసి ఇచ్చారు.
ఇందులో ఆయనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇంతలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో పీకే ఇచ్చిన రిపోర్టుపై పరిశీలించేందుకు మేడం సోనియా గాంధీ కమిటీనీ ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి ఓకే చెప్పింది. ఇదే సమయంలో పార్టీ ఓ అడుగు ముందుకేసి పీకేకు పార్టీలో చేరమంటూ ఆఫర్ ఇచ్చింది. దీనిని సున్నితంగా తిరస్కరించారు ప్రశాంత్ కిషోర్.
ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పి. చిదంబరం(P Chidambaram ). ఆయన పీకే పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అదేమిటంటే పీకే కాంగ్రెస్ పార్టీపై ఇచ్చిన రిపోర్ట్ అద్భుతంగా ఉందన్నాడు.
బాగా విశ్లేషించాడని, అయితే ఆయన ఇచ్చిన నివేదికలో నాయకత్వ సమస్య, మార్పు గురించి ప్రస్తావించ లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రియాంక గాంధీని కాంగ్రెస్ చీఫ్ గా నిలపాలని పీకే సూచించినట్లు జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. చాలా నెలలు కష్ట పడ్డారు. డేటా సేకరించారు.
దానిపై విశ్లేషించిన తీరు సూపర్ అంటూ కితాబు ఇచ్చారు పి. చిదంబరం(P Chidambaram ). పీకే ప్రతిపాదించిన వాటిల్లొ కొన్నింటిని ఆచరించనుంది పార్టీ అని తెలిపారు.
Also Read : ఏదో ఒక రోజు ప్రధానినవుతా