P Chidambaram : బీజేపీ ఆరోపణలు అర్థరహితం – చిదంబరం
బలవంతపు మత మార్పిడులపై కామెంట్
P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరోసారి భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. మరో వైపు ఆయనతో పాటు కుమారుడు ఎంపీ కార్తీ చిదంబరంను టార్గెట చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.
రాబోయే ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురాలన్నది మోదీ త్రయం ( మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) ప్లాన్. ఇందులో భాగంగానే బీజేపీయేతర సంస్థలు, ప్రభుత్వాలు, రాష్ట్రాలు, నాయకులు, వ్యక్తులు, కంపెనీలు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ వస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈ తరుణంలో రాజ్యసభ అభ్యర్థిగా పి. చిదంబరం సోమవారం కాంగ్రస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒకటి నుంచి 10వ తరగతి , కాలేజీ దాకా క్రైస్తవ విద్యా సంస్థల్లో చదివానని చెప్పారు పి. చిదంబరం.
కాషాయ పార్టీ, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న బలవంతపు మత మార్పిడుల ఆరోపణలు సత్య దూరమని ఆరోపించారు. పూర్తిగా అబద్దాలు, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు పి.చిదంబరం(P Chidambaram).
తాజాగా తంజావూరు పాఠశాలలో బాలిక మృతి చెందడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది బీజేపీ తమిళనాడు శాఖ. ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ అన్నామలై చేసిన ఆరోపణల్ని ఖండించారు చిదంబరం(P Chidambaram).
వేలాది మంది విద్యార్థులు క్రైస్తవ పాఠశాలల్లో, మిషనరీ విద్యాలయాల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. వాటిని గుర్తించకుండా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మాను కోవాలని సూచించారు.
Also Read : మోదీ ప్రభుత్వ పాలనకు జనామోదం