P Chidambaram : కేంద్రం నిర్వాకం వల్లే బొగ్గు, విద్యుత్ కొరత
నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మోదీ సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. పొంతన లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, దీని వల్ల ప్రాధాన్య రంగాలన్నీ కునారిల్లే స్థాయికి చేరుకున్నాయంటూ ఆరోపించారు.
దేశానికి ప్రధాన వనరుగా ఉన్న బొగ్గు కొరత ఉండడం ఏమిటని ప్రశ్నించారు. దీని వల్ల విద్యుత్ సరఫరా, ఉత్పత్తిలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. .
సామర్థ్యానికి మించి వనరులు ఉన్నప్పటికీ ఇవాళ ఎందుకు కొరత ఉందనేది పునరాలించు కోవాలని కేంద్ర సర్కార్ కు సూచించారు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు.
సమృద్దిగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. అంతకు మించి ఎక్కడా ఏ దేశంలో లేని విధంగా రైల్వే నెట్ వర్క్ కలిగి ఉంది. థర్మల్ ప్లాంట్ లలో ఉపయోగించని సామర్థ్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా బొగ్గు, విద్యుత్ కొరతకు కాంగ్రెస్ పార్టీ కారణమంటూ కేంద్ర సర్కార్ ప్రధానంగా పీఎం మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించడం దారుణంగా ఉందన్నారు.
పాలన చేతకాక ఇతరులపై అభాండాలు వేయడం వారిద్దరికీ అలవాటుగా మారి పోయిందని ఎద్దేవా చేశారు పి. చిదంబరం(P Chidambaram). ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం ఒక్కడే కేంద్ర సర్కార్ చేసిన మంచి పని ఎద్దేవా చేశారు.
తాము అన్ని రంగాలను పరిపుష్టం చేస్తే మీరు వచ్చాక వాటిని అమ్మకానికి పెడుతున్నారని ఈరోజు వరకు దేశం పట్ల వారికి సరైన పాలసీ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు మాజీ కేంద్ర మంత్రి.
Also Read : కుట్ర నిజం బీజేపీపై ఇక యుద్దం