P Chidambaram : మోదీ వైఫల్యం తిరోగమన భారతం
ఆకలి ఇండెక్స్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత
P Chidambaram : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం(P Chidambaram) నిప్పులు చెరిగారు. ఈ ఏడాది 2022 న విడుదలైన హంగర్ ఇండెక్స్ లో భారత దేశం స్థానం మరింత దిగజారడం బాధాకరమని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యమేనని ఆరోపించారు.
గత ఏడాది హంగర్ ఇండెక్స్ లో 101వ స్థానంలో ఉంటే ఈసారి మరింత ఆరు స్థానాలు దిగజారి 107వ స్థానానికి చేరడం పనితీరును తెలియ చేస్తుందని అన్నారు. మంగళవారం పి. చిదంబరం(P Chidambaram) మీడియాతో మాట్లాడారు. సోయి తప్పిన పాలనతో దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
రాబోయే రోజుల్లో ప్రజలు మోదీని తిరస్కరించడం ఖాయమని జోష్యం చెప్పారు. పేదరికం, ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యలపై ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఓ వైపు ద్రవ్యోల్బణం మరో వైపు నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూ పోతోందని కానీ చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిద్ర పోతోందని మండిపడ్డారు.
దేశంలో ఆర్థికమంత్రి ఉందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దేశాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారంటూ ఆరోపించారు పి. చిదంబరం. భారత దేశం పొరుగు దేశాలు పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకబడి ఉండడం బాధగా ఉందన్నారు. పిల్లలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని కానీ మోదీ మాత్రం విదేశాలలో పర్యటించడం ఓ హాబీగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉండగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ -2022 లో ప్రకటించిన వివరాలు పూర్తిగా అవాస్తవమని ఖండించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
Also Read : బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలపై విచారణ