Padma Awardee Daughter : కళాకారుల పట్ల మోదీ ప్రభుత్వం దయ చూపడం లేదని పద్మశ్రీ అవార్డు పొందిన 90 ఏళ్ల గురు మాయాధర్ రౌత్ (Padma Awardee Daughter)కూతురు ఆరోపించారు. కళాకారుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆమె నిలదీశారు.
ఢిల్లీలోని ప్రభుత్వ వసతి గృహం నుంచి తొలగించారు. 2014లో వసతిని రద్దు చేశారని, ఇప్పటికే తొలగింపు నోటీసులు అందజేశామని సర్కార్ చెబుతోంది. ఆయనతో పాటు తోటి కళాకారులు కోర్టును ఆశ్రయించారు.
కేసు ఓడి పోయారు. ఏప్రిల్ 25 వరకు గడువు విధించారు. దీంతో వసతి గృహంలో ఉంటున్న రౌత్ కు చెందిన వస్తువులను బయట పడవేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది కేంద్రం అనుసరిస్తున్న తీరుపై.
ఎంత మంది రాజకీయ నాయకులు ఓడి పోయినా ఇంకా ప్రభుత్వ క్వార్టర్లలో ఉండడం లేదని ప్రశ్నించింది పద్మశ్రీ అవార్డు గ్రహీత కూతురు.
బయట పడవేసిన వస్తువుల్లో ప్రభుత్వం అందించిన పద్మశ్రీ కొటేషన్ కూడా వీధిలో పడి ఉండడం ఇప్పుడు అందరినీ కలిచి వేసింది.
రౌత్ కూతురు మధుమిత రౌత్ తొలగింపు చట్ట బద్దమైనదే అయినప్పటికీ తొలగించిన తీరు మాత్రం అభ్యంతకరంగా ఉందని ఆరోపించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కళాకారులకు సరైన గౌరవం లభించడం లేదని వాపోయింది. రాజీవ్ గాంధీ హయాంలో కేటాయించారు.
దీనిని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడింది. తాను తండ్రితో ఉన్నాను కాబట్టి సరి పోయింది. లేక పోయి ఉంటే చని పోయి ఉండేవారంటూ కన్నీటి పర్యంతమైంది.
రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని వాపోయింది. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. మా తండ్రి దేశానికి సేవ చేశాడు. ఆయన ఎక్కడా ఆస్తి పోగేసు కోలేదు. ఆయన బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 3,000 మాత్రమే ఉన్నాయని తెలిపింది.
Also Read : కర్ణాటక మంత్రి కామెంట్స్ కలకలం