Padma Awards 2023 : 106 మందికి పద్మ పురస్కారాలు
ములాయం..జాకీర్ హుస్సేన్..బిర్లా
Padma Awards 2023 : దేశంలో అత్యున్నతమైన పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 106 మందిని ఎంపిక చేసింది. వారిలో దివంగత సీఎం ములాయం సింగ్ యాదవ్ , ప్రముఖ తబల విధ్వాంసుడు జాకీర్ హుసేన్ , కేఎం బిర్లా పద్మ అవార్డులు(Padma Awards 2023) పొందిన వారిలో ఉన్నారు.
దేశంలోని అత్యున్నత పురస్కారాలలో పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ , పద్మశ్రీ ఉన్నాయి. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి కూడా ఉన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పేర్లను ప్రకటించింది.
మూడు విభాగాలలో ఈ పురస్కారాలను అందజేస్తోంది కేంద్రం. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ వంటి విభాగాలు ఉన్నాయి. కార్యకలాపాల రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రదానం చేస్తారు. ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ కూడా ఉన్నాయి.
సమాజ్ వాదీ పార్టీ దివంగత అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ప్రజా వ్యవహారాల రంగంలో పద్మ విభూషణ్ పురస్కారం(Padma Awards 2023) దక్కింది. జాకీర్ హుస్సేన్ కు కళా రంగంలో పద్మ విభూషణ్ లభించింది. వీకే బిర్లాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు పద్మ భూషణ్ పొందారు. సుధా మూర్తి సామాజిక సేవ చేసినందుకు గుర్తింపు లభించింది.
దివంగత వ్యాపారవేత్త రాకేష్ ఝున్ ఝున్ వాలా, నటి రవీనా ఠాండన్ , మణిపూర్ బీజేపీ మాజీ చీఫ్ తౌనోజం చావోబా సింగ్ లను కూడా పద్మ అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
దేశానికి వివిధ రంగాలలో సేవలు అందించినందుకు అవార్డులు వరించాయి. వారందరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. ఇక కేంద్రం ప్రకటించిన మొత్తం 106 అవార్డులలో 6 పద్మ విభూషణ్ , 9 పద్మ భూషణ్ , 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
Also Read : ఆర్ఎస్ఎస్ మీటింగ్ కు నడ్డా..భగవత్