PAK vs AFG Asia Cup 2022 : ఆసియా కప్ ఫైనల్ కు పాకిస్తాన్
ఆశలు ఆవిరి టీమ్ ఇండియా ఇంటికి
PAK vs AFG Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ -2022 మెగా టోర్నీలో టైటిల్ ఫెవరేట్ గా ఉన్న
టీమ్ ఇండియా చాప చుట్టేసింది.
చేతులెత్తేసింది. ఇంటి బాట పట్టింది. ఇక నామ మాత్రపు జరిగే మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది. ఇప్పటికే సూపర్ -4లో శ్రీలంక భారత్ కు చుక్కలు చూపించింది.
నేరుగా ఫైనల్ కు చేరింది. కీలకమైన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో ఓటమి చవి చూశారు. తాజాగా నువ్వా నేనా అన్న రీతిలో
పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ జట్ల(PAK vs AFG Asia Cup 2022) మధ్య పోరు కొనసాగింది చివరి దాకా.
ఎట్టకేలకు పాకిస్తాన్ విజయాన్ని నమోదు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసింది. దీంతో శ్రీలంక, పాకిస్తాన్ మధ్య అంతిమ మ్యాచ్ జరగనుంది. ఏదో అద్భుతం
జరుగుతుందని భారత్ ఫైనల్ కు చేరుతుందని అనుకున్నారు.
కానీ ఆ సీన్ లేకుండా పోయింది. దీంతో రోహిత్ సేన అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంది. పాకిస్తాన్ విక్టరీ సాధించేందుకు నానా తంటాలు పడింది.
కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది ఆఫ్గనిస్తాన్ . నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 రన్స్ చేసింది. జట్టులో 35
పరుగులు చేసి ఇబ్రహీం టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 రన్స్ చేసి టార్గెట్ ఛేదించింది. షాదాబ్ ఖాన్ 36 పరుగులు చేస్తే ఇఫ్తికార్
30 రన్స్ తో రాణించాడు.
ఇక చివరి ఓవర్ లో 11 రన్స్ కావాల్సి ఉండగా పాకిస్తాన్ పేసర్ నసీమ్ షా వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
Also Read : నేర్చు కోవడంలో బాబర్ ఆజం ఫస్ట్ – కోహ్లీ