PAK vs NZ T20 World Cup : టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు పాకిస్తాన్
న్యూజిలాండ్ ను చితక్కొట్టిన పాక్
PAK vs NZ T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది పాకిస్తాన్. బలమైన న్యూజిలాండ్ కు చుక్కలు చూపించింది. పాకిస్తాన్ అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. దీంతో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీస్ ఫైనల్ జరగనుంది.
బుధవారం మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్(PAK vs NZ T20 World Cup) ఘన విజయాన్ని సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన కీలక పోరులో అనూహ్యమైన రీతిలో ఫైనల్ కు చేరడం విస్తు పోయేలా చేసింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తనకు ఎదురే లేదని చాటింది. మెగా టోర్నీలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది.
చివరకు దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడంతో రన్ రేట్ ఆధారంగా సెమీస్ కు చేరింది. ఈ తరుణంలో రేపటి మ్యాచ్ కీలకం కానుంది. యావత్ ప్రపంచం కోరుకున్నట్లుగానే దాయాది దేశాలు భారత్ , పాకిస్తాన్ ఫైనల్ కు రావాలని కోరుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకోవడంతో పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున సంబురాలు చోటు చేసుకున్నాయి.
నిన్నటి దాకా తిట్టిన వాళ్లే పొగుడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన కీవీస్ ను 152 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్లు రిజ్వాన్ , బాబర్ ఆజమ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ దుమ్ము రేపాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
రిజ్వాన్ 36 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం హారీస్ రాకతో సీన్ మారింది. 26 బంతులు ఆడి 30 రన్స్ చేశాడు. ఆఖరులో రిజ్వాన్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు మిచెల్ తో కలిసి కేన్ మామ ఇన్నింగ్స్ చక్క దిద్దాడు.
Also Read : ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ పై ఉత్కంఠ