Pakistan PM : మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డ‌లేదు

కోర్టులో పాకిస్తాన్ పీఎం షెహ‌బాబ్ ష‌రీఫ్

Pakistan PM : పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్(Pakistan PM) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌న‌ను తాను మజ్నూగా పిలుచుకున్నారు. ఈ మాట‌ల్ని ఆయ‌న కోర్టు విచార‌ణ సంద‌ర్భంగా పేర్కొన‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

పీఎం షెహ‌బాజ్ ష‌రీఫ్ , కుమారులు హంజా, సులేమాన్ పై అవినీతి నిరోధ‌క చ‌ట్టం , మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టంలోని వివిధ సెక్ష‌న్ల కింద న‌వంబ‌ర్ 2020లో పాకిస్తాన్ ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అభియోగాలు మోపింది.

ఈ అభియోగాల‌కు సంబంధించి కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ‌కు ప్ర‌ధాన మంత్రిగా ఉన్న షెహ‌బాజ్ ష‌రీఫ్ హాజ‌ర‌య్యారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు తాను జీతం తీసుకునేందుకు నిరాక‌రించాన‌ని చెప్పారు పీఎం.

త‌న‌ను తాను ఒక మూర్ఖుడినంటూ తెలిపారు. త‌న‌పై మోపిన 16 బిలియ‌న్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో ప్ర‌త్యేక కోర్టు విచార‌ణ‌లో శ‌నివారం వాంగ్మూలం ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా హంజా ష‌రీఫ్ ప్ర‌స్తుతం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు సీఎంగా ఉండ‌గా సులేమాన్ ష‌రీఫ్ యుకెలో నివ‌సిస్తున్నారు. 2008 నుండి 2018 దాకా షెహ‌బాజ్ ష‌రీఫ్ కుటుంబానికి చెందిన 28 బినామీ ఖాతాల‌ను ఎఫ్ఐఏ చేప‌ట్టిన విచార‌ణ‌లో గుర్తించింది.

దీని ద్వారా పాకిస్తాన్ రూపాయి 14 బిలియ‌న్లు లాండ‌రింగ్ చేయ‌బ‌డింద‌ని తెలిపింది. అంతే కాకుండా 17,000 క్రెడిట్ లావాదేవీల మ‌నీ ట్ర‌య‌ల్ ను కూడా ప‌రిశీలించింది. ఆ మొత్తాన్ని దాచిన ఖాతాల‌లో ఉంచారు.

కాగా తాను ప‌న్నెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వం నుండి న‌యా పైసా తీసుకోలేదు. ఈ కేసులో నేను 2.5 మిలియ‌న్ల‌ను లాండ‌రింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని పీఎం(Pakistan PM) విచార‌ణ సంద‌ర్భంగా చెప్పారు.

దేవుడు న‌న్ను ప్ర‌ధానిని చేశాడ‌ని, నేను ఏమీ దాచుకోలేద‌న్నాడు షెహ‌బాజ్ ష‌రీఫ్‌.

Also Read : శ్రీ‌లంక‌లో ఆగ‌ని ఆందోళ‌న‌లు

Leave A Reply

Your Email Id will not be published!