Modi Shahabaz : పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కొలువు తీరిన షెహబాజ్ షరీఫ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు పాకిస్తాన్ పీఎం షరీఫ్. నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య కీలకంగా మారిన కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు.
అంతే కాకుండా భారతదేశంతో పాకిస్తాన్ సత్ సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్ తో శాంతియుత, సహకారం ఉండాలని కోరారు.
జమ్మూ కాశ్మీర్ తో సహా పెండింగ్ లో ఉన్న ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం కూడా అవసరం. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం గురించి తెలిసిందే.
శాంతిని కాపాడుకుందాం. మన దేశాల ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ . ఇదే సమయంలో ప్రధాని మోదీ (Modi Shahabaz)చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
భారత దేశం ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుంది. దీని ద్వారా అభివృద్ధి సవాళ్లను పరిష్కరించు కోగలమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా, భారత్ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి అమెరికా వేదికగా. ఉగ్రవాదులకు, టెర్రరిజానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ వారిపై ఉక్కు పాదం మోపాలని పిలుపునిచ్చాయి.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఇదిలా ఉండగా కాశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు దేశాల మధ్య సయోధ్య కష్టమేనని పేర్కొనడం గమనార్హం.
Also Read : కేజ్రీవాల్ కనుసన్నలలో పంజాబ్ పాలన