Pakistan PM : శాంతి మా అభిమతం బైడెన్ కామెంట్స్ అబద్దం
తమ దేశం ప్రమాదకరం కాదని కామెంట్
Pakistan PM : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్ ఒకటి అని సంచలన ఆరోపణలు చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్న అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం కోలుకోలేని షాక్ కు గురి చేసింది.
దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు స్వయంగా పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగానే తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం ప్రధానమంత్రి షరీఫ్(Pakistan PM) స్పందించారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
అణ్వాయుధ సామర్థ్యం ఎలా ఉందనే దానిపై పరీక్షించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇంకో దేశంపై దండెత్తడానికో లేదా దాడి చేయడానికో కాదన్నారు. పాకిస్తాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు దేశమని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం కానీ లేదని పేర్కొన్నారు పీఎం.
పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా చీఫ్ చేసిన వ్యాఖ్యలను షెహబాజ్ షరీఫ్ తిరస్కరించారు. ఇది వాస్తవానికి తప్పుదోవ పట్టించడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. గత దశాబ్దాలుగా అణుకార్యక్రమం సాంకేతికంగా, పూల్ ఫ్రూఫ్ కమాండ్ , కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
తమది శాంతికాముక దేశమని తాము యుద్దాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఇతర దేశాలతో సత్ సంబంధాలు కొనసాగించేందుకు ప్రయారిటీ ఇస్తుందని స్పష్టం చేశారు. తాము అమెరికాతో పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా చీఫ్ బైడెన్ చేసిన ఈ ఆరోపణలు ఒక్కసారిగా పాకిస్తాన్ పరిస్థితిని తలకిందులు చేసేలా చేశాయి.
Also Read : ఇక మిగిలింది తైవాన్ ఒక్కటే – జిన్ పింగ్