Aamir Liaquat : పాక్ నేత‌ అమీర్ అనుమానాస్ప‌ద మృతి

రాజ‌కీయ‌వేత్త ..టీవీ హోస్ట్ గా పేరొందారు

Aamir Liaquat : పాకిస్తాన్ కు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు, టీవీ హోస్ట్ గా పేరొందిన 49 ఏళ్ల అమీర్ లియాఖ‌త్(Aamir Liaquat)  అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు.

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి, మాజీ పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన నాయ‌కుడు అమీర్.

ఇదిలా ఉండ‌గా ఖుదాద్ కాల‌నీలోని త‌న ఇంట్లో అప‌స్మార‌క స్థితిలో క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. కాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమీర్ లియాఖ‌త్ ను ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

శ‌వ ప‌రీక్ష చేసేందుకు కుటుంబ స‌భ్యుల ప‌ర్మిష‌న్ ను కోరారు పోలీసులు. కాగా అమీర్ లియాఖ‌త్(Aamir Liaquat)  పాకిస్తాన్ మాజీ జాతీయ అసెంబ్లీ స‌భ్యుడిగా ఉన్నారు.

ప్ర‌ముఖుడిగా పేరొందారు హోస్ట్ గా. క‌రాచీలో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన‌ట్లు స్థానిక మీడియా గురువారం వెల్ల‌డించింది. అమీర్ లియాఖ‌త్ బుధ‌వారం రాత్రి అసౌక‌ర్యానికి గుర‌య్యాడు.

అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆస్ప‌త్రికి వెళ్లేందుకు నిరాక‌రించాడని జియో టీవీ తెలిపింది. కాగా గురువారం అమీర్ లియాఖ‌త్ గ‌ది నుంచి అరుపులు వినిపించాయ‌ని ఆయ‌న ఉద్యోగి జావెద్ వెల్ల‌డించారు.

కాగా గ‌ది లోప‌లి నుంచి తాళం వేసి ఉంది. అటువైపు నుంచి ఎటువంటి స్పంద‌న రాక పోవ‌డంతో అత‌ని ఇంటి సిబ్బంది గ‌ది త‌లుపులు ప‌గల‌గొట్టారు.

అనంత‌రం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. అమీర్ మృతిపై పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. క‌రాచీ లోని ఖుదాదాద్ కాల‌నీలో ఉన్న అత‌డి ఇంట్లో సోదాలు చేప‌ట్టారు.

Also Read : యూఎస్ స్కూల్స్ ల‌లో కింగ్ డొనాల్డ్ పుస్త‌కం

Leave A Reply

Your Email Id will not be published!