FIA DG Mohsin Butt : దావూద్ అప్పగింతపై పాకిస్తాన్ దాటవేత
FIAచెప్పేందుకు ఎఫ్ఐఏ డీజీ నో కామెంట్
FIA DG Mohsin Butt : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగిస్తారా అన్న దానిపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇంటర్ పోల్ మీటింగ్ సందర్భంగా హాజరయ్యారు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్(FIA DG Mohsin Butt). ఈ సందర్భంగా భారత మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాట వేశారు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి పంపబడిన ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందంలో మొహ్సిన్ బట్ ఒకరు. కాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ల గురించి ప్రశ్నలకు నో కామెంట్ అని పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీంతో పాటు హఫీజ్ సయీద్ లు కీలక సూత్రధారులు.
వీరిద్దరూ భద్రతా సంస్థలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఉన్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నారని సమాచారం. ఆ ఇద్దరిపై కామెంట్ చేసేందుకు నిరాకరించారు బట్. సరిహద్దు తీవ్రవాదంపై ఇస్లామాబాద్ , న్యూఢిల్లీ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సహా అనేక ప్రపంచ వేదికలపై కాశ్మీర్ సమస్యను పదే పదే పాకిస్తాన్ లేవనెత్తుతోంది. అయినా పాకిస్తాన్ బృందం పాల్గొనడం విశేషం. జనరల్ అసెంబ్లీ ఇంటర్ పోల్ కు సంబంధించిన అత్యున్నత పాలకమండలి. దాని పనితీరుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఏడాది ఒకసారి సమావేశం అవుతుంది.
ఈసారి బారత్ వేదికగా మారింది. అంతకు ముందు ప్రధాని మోదీ(PM Modi) ప్రసంగించారు. మొత్తం నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. 195 ఇంటర్ పోల్ సభ్య దేశాల సభ్యులు పాల్గొన్నారు.
Also Read : సరిహద్దు వివాదంపై జై శంకర్ కామెంట్స్