Palvai Sravanthi : కాంగ్రెస్ కు పాల్వాయి గుడ్ బై
త్వరలో బీఆర్ఎస్ లోకి జంప్
Palvai Sravanthi : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. మునుగోడులో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Palvai Sravanthi Party Change
తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. శనివారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా గతంలో పార్టీలో సీనియర్ గా, మంత్రిగా ఉన్న పాల్వాయి గోవర్దన్ రెడ్డి తనయురాలు. భారతీయ జనతా పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడి పోయారు.
తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్నట్టుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి ఉన్నట్టుండి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేవలం 48 గంటల్లో మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు. ఇది విస్తు పోయేలా చేసింది.
త్వరలోనే తాను బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్ సమక్షంలోనే తాను చేరబోతున్నట్లు ప్రకటించారు పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi). దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి పెద్ద దెబ్బ. ఇది ఊహించని పరిణామం. తనను కావాలని తొక్కి పెట్టారని, అసలు తనను ఒక లీడర్ గా పరిగణించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు పాల్వాయి స్రవంతి.
Also Read : Eatala Rajender : గజ్వేల్ లో ఎగిరే జెండా నాదే