TTD EO : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఫోకస్ పెట్టింది.
వచ్చే ఏప్రిల్ 3 నుంచి పంచగవ్య ఔషధాలతో చికిత్స చేసేందుకు శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇందు కోసం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈవో జవహర్ రెడ్డి(TTD EO ).
గో సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్ అంశాలపై సమీక్షించారు. ఆయుర్వేద ఆస్పత్రిలో ఓపీ, 12 పడకలతో ఇన్ పేషింట్ విభాగం కూడా ప్రారంభించాలన్నారు.
ఇందు కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈవో. అంతే కాకుండా పంచగవ్య ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తిరుమలకు ప్రతి రోజూ 3 వేల లీటర్ల పాలు, 60 కిలోల నెయ్యి కావాలని దీనిని ఉత్పత్తి చేసుకునేందుకు స్వంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు రెడ్డి. దేశీవాళి ఆవుల సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తిరుపతి గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం కోసం భవన నిర్మాణం త్వరగా జరగాలన్నారు. ఇక్కడ తయారయ్యే పాలు, పెరుగు తిరుమలలో ని అన్నాదనం కాంప్లెక్స్ కు పంపించాలని స్పష్టం చేశారు.
రైత సాధికార సంస్థ ద్వారా గో ఆధారిత వ్యవసాయన్ని ప్రోత్సహిస్తామన్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రైతులకు 1300లకు పైగా ఎద్దులు, ఆవులు ఉచితంగా ఇచ్చామని తెలిపారు జవహర్ రెడ్డి.
గోశాలల నిర్వాహకులకు గో ఆధారిత ఉత్పత్తుల తయారీపై ఇస్కాన్ సహకారంతో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
Also Read : అలా అన లేదు సీఎంతో గ్యాప్ లేదు