Parag Agarwal : ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) పరాగ్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశాడు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ భారీ డీల్ తో ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు.
ఈ సందర్భంగా పరాగ్ అగర్వాల్ (Parag Agarwal )స్పందించాడు. ప్రస్తుతం సంస్థలో అనిశ్చితి కాలం ప్రవేశిస్తోందని వాపోయాడు. వీడియో ద్వారా ఆల్ హ్యాండ్ మీటింగ్ ను నిర్వహించారు.
కంపెనీని బిలియనీర్ టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ కు విక్రయించాలనే ట్విట్టర్ బోర్డు నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ , టెస్లా సంస్థ మధ్య ఒప్పందంపై సంతకం చేసినట్లు వెల్లడించారు పరాగ్ అగర్వాల్(Parag Agarwal ).
ఈ సందర్భంగా ఉద్యోగులతో ట్విట్టర్ సిఇఓ మాట్లాడారు. సోషల్ నెట్ వర్క్ ఎప్పటి లాగే పని చేస్తుందన్నారు. కంపెనీని ప్రైవేట్ గా తీసుకునేందుకు మస్క్ లావాదేవీ పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం పట్టవచ్చని వెల్లడించారు.
అయితే కొంత మంది ఉద్యోగులు తమ పరిస్థితి ఏంటి అని అడిగిన ప్రశ్నకు సిఇఓ సమాధానం ఇచ్చారు. ట్విట్టర్, ఎలోన్ మస్క్ మధ్య ఒప్పందం పూర్తయ్యేందుకు ఆరు నెలల సమయం పట్టవచ్చని తెలిపారు.
ఈ సమయంలో ఉద్యోగాల కోతలు ఉండవని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే మస్క్ కాల్ కు పరాగ్ అగర్వాల్ దూరంగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా మాజీ సీఇఓ , ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే తో సహా ఇతర బోర్డు సభ్యులు ఎవరూ హాజరు కాలేదు.
Also Read : రాణా..కపిల్..ధీరజ్ రూ. 5050 కోట్ల స్కాం