Paramilitary Jawan : జవాన్ కాల్పుల్లో ఇద్దరు మృతి
పోరుబందర్ లో చోటు చేసుకున్న ఘటన
Paramilitary Jawan : గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోరుబందర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతులగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో భాగంగా ముందస్తుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. ఇదిలా ఉండగా ఎన్నికల విధుల నిర్వహణ కోసం వచ్చిన ఓ జవాన్(Paramilitary Jawan) తన సహచరులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పారా మిలటరీ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక్కడికి ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు మణిపూర్ కు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు చెందిన జవాన్లు పోర్ బందర్ కు వచ్చారు. ఈ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను పునరావాస కేంద్రంలో సేద తీరారు.
మణిపూర్ నుంచి పోరుబందర్ కు బస్సులో వస్తుండగా ఇన్ చౌ సింగ్ అనే జవాను తన సహచర జవాన్లతో గొడవ పడ్డాడు. అదే మనసులో పెట్టుకుని తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.
గాయపడిన వారిని వెంటనే భావ్ సింగ్ జీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లు సమాచారం. తోయిబా సింగ్ , జితేందర్ సింగ్ లు కాల్పుల్లో మరణించారు. చోర జిత్ సింగ్ , రోహికానగా గాయపడ్డారు.
Also Read : పీఎస్ఎల్వీ – సీ54 సక్సెస్