Pariksha Pe Charcha PM : ప‌రీక్ష స‌హ‌జం ఒత్తిడికి దూరం – మోడీ

పిల్ల‌ల‌పై త‌ల్లిండ్రులు వ‌త్తిడి చేయొద్దు

Pariksha Pe Charcha PM : భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ప‌రీక్షా పే చ‌ర్చ పేరుతో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని(Pariksha Pe Charcha PM) మాట్లాడారు. తాను కూడా నిత్యం ప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్నానని అన్నారు. కానీ ఏనాడూ తాను ఒత్తిడికి లోను కాన‌ని చెప్పారు. ఎంత ఎక్కువ‌గా స‌మాచారం తెలుసుకుంటే అంత బ‌ల‌వంతుల‌వుతార‌ని అన్నారు న‌రేంద్ర మోడీ.

కోట్లాది మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని కానీ తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌కు లోన‌వుతుండ‌డం త‌న దృష్టికి వచ్చింద‌న్నారు. ఢిల్లీ లోని త‌ల్క‌తోరా స్టేడియంలో విద్యార్థుల‌తో సంభాషించారు మోడీ. అయితే ఇవాళ ప్ర‌తి రంగంలోనూ పోటీ నెల‌కొంద‌న్నారు. దీంతో పేరెంట్స్ కూడా ఆ పోటీకి అనుగుణంగా త‌మ పిల్ల‌లు కూడా టాప్ లో ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని ఇందులో ఎలాంటి త‌ప్పు లేద‌న్నారు.

కానీ విప‌రీత‌మైన అంచ‌నాలు పెట్టుకోవ‌డం, ఎక్కువ‌గా ఫోర్స్ చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో భ‌యాందోళ‌న నెల‌కొంటుంద‌న్నారు న‌రేంద్ర మోడీ. ఒత్తిడిలో మీలో ఉన్న అత్య‌ధిక సామ‌ర్థ్యాలు పూర్తిగా వెనుక‌బ‌డి పోతాయ‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన క‌థ కూడా ప్ర‌ధాని చెప్పారు. ఇళ్ల‌ల్లో త‌ల్లులు ఎలా టైం ను గుర్తించి ప‌నులు చేస్తారో చూడాల‌న్నారు.

ఎక్క‌డా వారు క్ర‌మం త‌ప్ప‌ర‌ని గుర్తు చేశారు. అలాగే మీరు కూడా స‌బ్జెక్టుపై అవ‌గాహ‌న పెంచుకుంటే ఒత్తిడి నుంచి చాలా మ‌టుకు దూరం అవుతార‌ని తెలిపారు మోడీ. కాపీ కొట్ట‌డంపై కూడా మాట్లాడారు. కాపీ చేస్తే ఒక్క‌సారి పాస్ కావ‌చ్చు..కానీ జీవిత‌మ‌నే ప‌రీక్ష‌లో గెల‌వ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్నారు మోడీ.

Also Read : ఎన్నిక‌లొస్తే బీజేపీదే మ‌ళ్లీ అధికారం

Leave A Reply

Your Email Id will not be published!