Sridharan Sharath Sarfaraz : ప‌రిశీల‌న‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్

స్ప‌ష్టం చేసిన బీసీసీఐ సెలెక్ట‌ర్

Sridharan Sharath Sarfaraz : దేశీవాళి క్రికెట్ లో దుమ్ము రేపుతూ స‌త్తా చాటుతున్నాడు యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్. రంజీ ట్రోఫీలో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. అయినా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. భార‌త దేశంలో ఆస్ట్రేలియా పర్య‌టించ‌నుంది. ఈ సంద‌ర్భంగా నాలుగు టెస్టులు ఆడ‌నుంది.

తాజాగా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఎంపిక‌పై మౌనం వీడారు. అత‌డిని ఎంపిక చేయ‌క పోవ‌డంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను కాకుండా ముంబైకి చెందిన ఇషాన్ కిష‌న్ , సూర్య కుమార్ యాద‌వ్ కు చోటు క‌ల్పించింది బీసీసీఐ. కానీ స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan) ను ప‌క్క‌న పెట్ట‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డం ప్ర‌తిబంధకంగా మారింద‌ని వాపోయాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్.

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) సెలెక్ట‌ర్ ఈ విష‌యంపై మౌనాన్ని వీడారు శ్రీ‌ధ‌ర‌న్ శ‌ర‌త్(Sridharan Sharath). బ్యాటింగ్ విష‌యంపై కీల‌క‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు. టెస్టు జ‌ట్టు ఎంపిక విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం జ‌ట్టులో అన్ని స్థానాలు పూర్తిగా నిండి పోయాయ‌ని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ఛ‌తేశ్వ‌ర్ పుజారా అనుభ‌వ‌జ్ఞులు ఉన్నార‌ని తెలిపాడు.

కోహ్లీ ఇప్ప‌టికీ మ్యాచ్ విన్న‌ర్ గా ఉన్నాడు. పుజారా వ‌ల్ల బ్యాటింగ్ కు స్థిర‌త్వం ఉంటుంద‌న్నాడు. రోహ‌త్ శ‌ర్మ అద్భుత‌మైన లీడ‌ర్ అని ప్ర‌శంసించాడు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్ , శుభ్ మ‌న్ గిల్, కేఎల్ రాహుల్ స్థిరంగా రాణిస్తున్నార‌ని వీరిలో ఎవ‌రిని ప‌క్క‌న త‌ప్పించలేమ‌ని స్ప‌ష్టం చేశాడు. కొంత స‌మ‌యం నిరీక్షించాల్సి వ‌స్తుంద‌న్నాడు.

Also Read : టీ20 సీరీస్ కు టీమిండియా రెడీ

Leave A Reply

Your Email Id will not be published!