Parineeti Chopra Chadha : 13న చోప్రా చద్దా నిశ్చితార్థం
శనివారం ముహూర్తం ఖరారు
Parineeti Chopra Chadha : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ , పంజాబ్ గౌరవ సలహాదారు రాఘవ్ చద్దా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎట్టకేలకు మౌనం వీడారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ చాలా సార్లు కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు పరిణీతి చోప్రా రాఘవ్ చద్దా ఇద్దరూ ఒక్కటి కానున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. మే 13న శనివారం రోజు చోప్రా, చద్దా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగనుంది.
కాగా ఇప్పటి వరకు వీరిద్దరూ ఇంత వరకు తమ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఇంకా బయట పడలేదు. ఎక్కడా చెప్పలేదు. కానీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిశ్చితార్థం వేడుకలకు 150 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. అయితే పెళ్లి తేదీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది చివరలో వివాహం జరగనుందని సమాచారం.
మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు రాఘవ్ చద్దా. ఆయన టాప్ యూనివర్శిటీలో చదువుకున్నారు. ఇక పరిణీతి చోప్రా బాలీవుడ్ లో నటిగా గుర్తింపు పొందారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముంబై లోని బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో దర్శనం ఇచ్చారు. కెమెరాలు చద్దా, చోప్రాను కెమెరాల్లో బంధించాయి.
Also Read : పట్నాయక్ తో నితీశ్ కుమార్ భేటీ