Partha Arpita ED : పార్థ‌..అర్పిత ముఖ‌ర్జీలు జైలుకు

కోలుకోలేని షాక్ ఇచ్చిన కోర్టు

Partha Arpita ED : పాఠ‌శాల నియామ‌కాల‌కు సంబంధించి అరెస్ట్ అయిన ప‌శ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీ, ఆయ‌న స‌న్నిహితురాలు అర్పిత ముఖ‌ర్జీల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోర్టు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) శుక్ర‌వారం ముగిసింది. మ‌రోసారి 14 రోజులు జుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. దీంతో మ‌రో 14 రోజుల పాటు జైలులో ఉండ‌నున్నారు.

ఈ టీచ‌ర్ల స్కాంకు సంబంధించి త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 18కి వాయిదా వేసింది. బెంగాల్ లో టీఎంసీతో పాటు కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్నారు పార్థ ఛ‌ట‌ర్జీ.

ఈ త‌రుణంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఉన్న‌ట్టుండి మోదీ స‌ర్కార్ కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది దీదీకి. ఆమెకు రైట్ హ్యాండ్ గా ఉన్న పార్థ ఛ‌ట‌ర్జీ వ్య‌వ‌హారంపై గ‌త కొంత కాలం నుంచీ నిఘా పెడుతూ వ‌చ్చింది.

త‌మ‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చిన సీఎంకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది ఈడీ రూపంలో కేంద్రం. దెబ్బ‌కు మ‌మ‌తా బెన‌ర్జీ మౌనం వ‌హించింది.

ఈ మేర‌కు పార్టీపై పెద్ద ఎత్తున అవినీతి, అక్ర‌మాల మ‌ర‌క అంట‌కుండా ఉండేందుకు పార్థ‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో పార్థ ఛ‌ట‌ర్జీకి స‌న్నిహితురాలిగా పేరొందిన అర్పిత ఛ‌ట‌ర్జీ ఇళ్ల‌ను టార్గెట్ చేసింది ఈడీ(Partha Arpita ED).

ఇదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున సోదాలు చేప‌ట్టింది. ఆమెకు చెందిన ఇళ్లు, ఫామ్ హౌస్ ల‌పై దాడులు చేప‌ట్టింది. ఏకంగా రూ. 50 కోట్ల న‌గ‌దు తో పాటు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

Also Read : మిస్ యూనివ‌ర్స్ హ‌ర్నాజ్ సంధుపై దావా

Leave A Reply

Your Email Id will not be published!