Keshav Prasad Maurya : ప్రభుత్వం కంటే పార్టీ గొప్పది – మౌర్య
ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ కామెంట్స్
Keshav Prasad Maurya : ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య(Keshav Prasad Maurya) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్నారు. పార్టీ ఉంటేనే సర్కార్ ను ఏర్పాటు చేయగలమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొత్త వ్యక్తిని పార్టీ చీఫ్‌గా నియమించేందుకు పార్టీ హైకమాండ్ యోచిస్తోందంటూ ఊహాగానాలు రేకెత్తాయి.
జోరుగా ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ మరింత హీట్ పుట్టించాయి. ఉత్తర ప్రదేశ్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న స్వతంత్ర దేవ్ సింగ్ గతంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.
మంత్రులు, సీఎంలు కంటే ముందు పార్టీ ముఖ్యం. పార్టీకి సంబంధించి కార్యకర్తలే పట్టుకొమ్మలు. వారు లేకుండా పార్టీ మనుగడ సాధించడం కష్టం.
ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్లినా పార్టీ ముఖ్యమని చెబుతూ వస్తుంటారని పేరు చెప్పని ఒక నేత పేర్కొన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి రాష్ట్రంలో.
విచిత్రం ఏమిటంటే అత్యంత జనాదరణ కలిగిన నాయకులు, సీఎంలలో టాప్ లో ఉన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi). ఆయన సారథ్యంలోనే బీజేపీ రెండోసారి యూపీలో పవర్ లోకి వచ్చింది.
అయితే పార్లమెంటరీ బోర్డులో అనూహ్యంగా మధ్య ప్రదేశ్ సీఎం చౌహాన్ , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగికి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఎన్నికల పరిశీలన కమిటీకి కూడా తీసుకోలేదు.
Also Read : పూల దండలు కాదు ఉరితాళ్లే కరెక్ట్