Patel Ramesh Reddy : దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్ట్
పటేల్ రమేష్ రెడ్డి కామెంట్స్
Patel Ramesh Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. నువ్వా నేనా అన్న రీతిలో ఫైటింగ్ కొనసొగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. చివరి విడతలో మిగిలి పోయిన నాలుగు సీట్లను ఖరారు చేసింది ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ.
Patel Ramesh Reddy Slams Damodar Reddy
దీంతో చివరి వరకు ప్రయత్నం చేస్తూ వచ్చారు సీనియర్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి(Patel Ramesh Reddy). ఈ సందర్బంగా తాను రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ అని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే తాను బరిలో ఉన్నాడని మండిపడ్డారు.
పార్టీ కోసం తాను ముందు నుంచీ పని చేస్తూ వచ్చానని, చివరి దాకా సర్వేలలో తన పేరు మొదటి స్థానంలో ఉందన్నారు. కానీ తనను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు కొందరు సీనియర్ నేతలు తనకు టికెట్ రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వేలన్నీ తాను గెలవ బోతున్నానని చెప్పాయని కానీ ఏరికోరి దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఉన్న గూడు పుఠాణి ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు రమేష్ రెడ్డి. పోయిన సారి హైకమాండ్ కోరిక మేరకు తాను తల వంచానని కానీ ఈసారి వెనుదిరిగే ప్రసక్తి లేదన్నారు. బరిలో ఉంటానని బరా బర్ గెలుస్తానంటూ ప్రకటించారు.
Also Read : CM KCR : గెలుపు నాదే సీఎం నేనే – కేసీఆర్