Pathan Box Office : పఠాన్ విజయం కలెక్షన్ల వర్షం
బాక్సాఫీసులు బద్దలు
Pathan Box Office : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కలిసి నటించిన పఠాన్ మూవీ దూసుకు పోతోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదట్లో సినిమా ట్రైలర్ నుంచి సాంగ్స్ దాకా సినిమాపై రాద్దాంతం చోటు చేసుకుంది. రోజు రోజుకు కలెక్షన్ల సునామీతో విస్తు పోయేలా చేసింది బాలీవుడ్ ను. ఊహించని విజయంతో విజయోత్సవ కార్యక్రమాలలో మునిగి తేలుతోంది పఠాన్ చిత్ర యూనిట్(Pathan Box Office).
ఈ సందర్భంగా నటి దీపికా పదుకొనే ఏకంగా సక్సెస్ ఇచ్చిన కిక్ తో తట్టుకోలేక కంటతడి పెట్టింది. 13వ రోజుతో కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కలెక్షన్లతో సమానంగా నిలిచింది. ఈ విషయాన్ని సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ వెల్లడించాడు. ఒక్క సోమవారం రోజు రే. 8.25 కోట్లు వసూలు చేసింది. దాని బాక్సాఫీస్ మొత్తం రూ. 422.75 కోట్లకు చేరుకుంది.
పఠాన్ నిర్మాతలు యష్ రాజ్ ఫిల్మ్స్ టికెట్ ధరలను తగ్గించడంతో కొంత ఆదాయం తగ్గిందని ఆదర్శ్ తెలిపారు. పఠాన్ చిత్రం గత నెల జనవరి 25న 100కి పైగా దేశాల్లో విడుదలైంది. అప్పటి నుండి వరుసగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు(Pathan Box Office) కొడుతోంది. వీకెండ్ లో భారీగా వసూలు చేసింది.
శుక్రవారం 13.50 కోట్లు, శనివారం 22.50 కోట్లు, ఆదివారం 27.50 కోట్లు, సోమవారం 8.25 కోట్లు మొత్తం 422.75 కోట్లు ఒక్క హిందీ బిజినెస్ అని పేర్కొన్నారు తరన్ ఆదర్శ్. ఇదిలా ఉండగా కేజీఎఫ్ హిందీ డబ్ మూవీ రూ. 500 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ వెర్షన్లు పఠాన్ కు సంబంధించి రూ. 30 లక్షలు రాబట్టాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 438.45 కోట్లకు చేరింది.
Also Read : కాశ్మీర్ ఫైల్స్ పనికి మాలిన సినిమా