Pathan Movie Record : ప‌ఠాన్ మూవీ క‌లెక్ష‌న్ల సునామీ

ఐదో రోజుకు రూ. 500 కోట్లు

Pathan Movie Record : షారుఖ్ ఖాన్ , దీపికా ప‌దుకొనే , జాన్ అబ్ర‌హం క‌లిసి న‌టించిన ప‌ఠాన్ మూవీ ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. ఇప్ప‌టికే కోట్లు కొల్ల‌గొడుతూ విస్తు పోయేలా చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు క‌లెక్ష‌న్లు సాధిస్తుందోన‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో వైపు ప‌ఠాన్ రిలీజ్ కు ముందు నుంచి దేశ వ్యాప్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ దాని అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆందోళ‌న‌లు కూడా కొన‌సాగాయి.

బేష‌ర‌మ్ సాంగ్ పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. హిందూ సంస్కృతిని కించ ప‌రిచేలా చిత్రీక‌రించారంటూ ఆరోపించారు. దీంతో చోటు చేసుకున్న వివాదం ఏదీ సినిమా స‌క్సెస్ ను అడ్డుకోలేక పోయింది. పెద్ద ఎత్తున ప‌ఠాన్ కు(Pathan Movie Record) ఆద‌ర‌ణ నెల‌కొంది. మొత్తంగా బాక్సుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది క‌లెక్షన్లను. ప్ర‌స్తుతం షారుఖ్ ఖాన్ ప‌ఠాన్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

విడుద‌లైన అయిదు రోజుల్లోనే 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 542 కోట్ల గ్రాస్ ను కొల్ల‌గొట్టింది. ప‌ఠాన్ మూవీ ఇండియాలో రూ. 336 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ లో రూ. 307 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇదిలా ఉండ‌గా చిత్రానికి సంబంధించి సినిమా ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

ఒక ర‌కంగా నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత షారుఖ్ ఖాన్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ల‌న్లు బ‌ద్ద‌లు కొడుతోంది. తెలుగు, త‌మిళంలో రూ. 9.75 కోట్లు కొల్ల‌గొట్టింది.

Also Read : క‌ర్ణాట‌క షోలో కైలేష్ ఖేర్ పై దాడి

Leave A Reply

Your Email Id will not be published!