#PathanjaliRuchi : ఇక నుంచి రుచి పతంజలి

బ‌డా కంపెనీల‌కు పతంజ‌లి షాక్

Pathanjali Ruchi: చూస్తే బాబా..కానీ రాందేవ్ బాబా అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలకు దడ. తక్కువ కాలంలో తన పేరుతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఒకే ఒక్క యోగా గురు. అవసరమైతే ప్రపంచంలో ఎక్కడికైనా తాను అనుకుంటే చాలు క్షణాల్లో వెళ్లగలడు. ప్రపంచ మార్కెట్ లో తమ హవా కొనసాగిస్తూ, ఇండియాపై పెత్తనం చెలాయించాలి అనుకున్న ప్రతి కార్పొరేట్ కంపెనీకి దిమ్మ తిరిగేలా కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ యువతీ యువకులకు, వ్యాపార వేత్తలుగా రాణించాలని అనుకునే వాళ్లకు ఆయనో ఓ ఐకాన్.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని మొత్తం మార్కెట్ రంగాన్ని పతంజలి శాసిస్తోంది. బాలకృష్ణ, రాందేవ్ బాబా ల ఐడియాల ముందు కార్పొరేట్ కంపెనీలు తేలిపోయాయి. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా పతంజలి అన్న బోర్డు తప్పక ఉండే ఉంటుంది. ప్రతి భారతీయుడు తమ ఉత్పత్తులను వాడుకునేలా చేసిన ఘనత పతంజలి గ్రూప్(Pathanjali Ruchi) ఆఫ్ కంపెనీస్ సీయివో బాలకృష్ణ ఆచార్య దే. రాందేవ్ బాబాకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడానికే ఆయనే కారణం. ప్రస్తుతం ఆయుర్వేద రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది.

మోదీతో చనువు ఉండటం కూడా తన బిజినెస్ ను మరింత విస్తరించేందుకు వీలు కలిగింది. బాలకృష్ణ ఆచార్య మెలమెల్లగా ఇండియాలో పేరొందిన కంపెనీలను టేకోవర్ చేసుకునే పనిలో పడ్డారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రుచి ప్రోడక్ట్స్ చాలా పాపులర్. ఇంకేం ఏకాజ్ఞా కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేసుకున్నారు. ఇందు కోసం కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. రుచి పతంజలి పరమైంది. ఇదిలా ఉండగా పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలో 10వేల కోట్ల టర్నోవర్‌ సాధించిన భారతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ సంస్థగా ఈ ఏడాది రికార్డు సృష్టించింది.

దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థల్ని వెనక్కి నెట్టి అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ల తరవాత నాలుగో స్థానంలో నిలిచింది. రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థగా అవతరించే దిశగా పతంజలి అడుగు లేస్తోంది. పతంజలి ఆయుర్వేద సంస్థ(Pathanjali Ruchi)ను 1995లో హరిద్వార్‌లోని కన్‌కల్‌ ప్రాంతంలో స్నేహితుడు బాలకృష్ణతో కలిసి దివ్య ఫార్మసీ అనే చిన్న ఔషధ దుకాణంతో రామ్‌దేవ్‌ ప్రారంభించారు.

స్నేహితుడు బాలకృష్ణకు ఆయుర్వేదం పైన తిరుగు లేని పట్టుంది. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే ఆశ్రమంలో పెరిగారు. హిమాలయాలకూ కలిసే ప్రయాణమయ్యారు. అక్కడ రామ్‌దేవ్‌ యోగా సాధనలో నిమగ్నమైతే, బాలకృష్ణ ఆయుర్వేదంలో నైపుణ్యం సాధించారు. దేశ వ్యాప్తంగా 47 వేల రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. ఇప్పటి దాకా వెయ్యి ఉత్పత్తులను అందజేస్తోంది పతంజలి(Pathanjali Ruchi). పర్మనెంట్ గా 1500 మంది రైతులు సేవలు అందజేస్తున్నారు. హరిద్వార్‌లో పతంజలి ప్రధాన కార్యాలయ ఉన్నది.

దీని ప్రాంగణ వైశాల్యం దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే ఉంటుంది. కొత్త ఉత్పత్తుల తయారీ కోసం 200 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. మొత్తం ఇందు కోసం 30 ఫ్యాక్టరీలు ఉండగా, ఇతర దేశాలకు పతంజలికి చెందిన 10 ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. పతంజలి నుంచి సబ్బులు, షాంపులు, పేస్టులు, టాయిలెట్‌ క్లీనర్లూ, నిత్యావసరాలూ, పిల్లల ఆహారం. ఇలా ఐదేళ్లలో యాభై నుంచి ఏకంగా వెయ్యికి పైగా ఉత్పత్తులను తీసుకొచ్చే స్థాయికి పతంజలి విస్తరించింది.

ప్రత్యేక స్టోర్లు ఉండటంతో ఒక వస్తువు కొనడానికి వచ్చేవాళ్లు నాలుగైదు వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉండేది. పతంజలి నూడుల్స్‌ చాలా పాపులర్. ఆచార్య బాలకృష్ణ ‘పతంజలి’లో 94 శాతం వాటా ఆయనదే. సంస్థ ముఖ చిత్రం రామ్‌దేవ్‌ అయితే, దాని చోదక శక్తి బాలకృష్ణ. ముప్ఫయ్యేళ్లుగా రామ్‌దేవ్‌కి సన్నిహితుడిగా ఉంటున్న బాలకృష్ణకి ఆయుర్వేద విద్యలో అద్భుతమైన నైపుణ్యం ఉంది.
కాలక్రమంలో మరుగున పడిన ఎన్నో ఆయుర్వేద సూత్రాలను ఆయన వెలికి తీసి వాటి ఆధారంగా తిరిగి ఆ ఔషధాలను తయారు చేశారన్న పేరుంది.

తొలి దశలో సంస్థ తీసుకొచ్చిన ఔషధాలూ, ఉత్పత్తులన్నీ ఆయన సృష్టే. ప్రచారం చేసేది రామ్‌దేవ్‌ అయినా దాని వెనకుండే వ్యూహకర్త బాలకృష్ణే. ప్రయోగశాల నుంచి బయటికొచ్చిన ప్రొడక్ట్‌ని ఆమోదించి, దాన్ని ప్యాక్‌ చేసి మార్కెట్‌కి తరలించే వరకూ ప్రతి పనీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. ‘పతంజలి ఆయుర్వేద్‌’కు ఎండీగా ఉన్న ఆయన, మరో 34 అనుబంధ సంస్థలకూ అధినేత. రాబోయే 5-10 ఏళ్ల కాలానికి లక్ష కోట్లు అమ్మకాలు రామ్‌దేవ్‌, బాలకృష్ణలు పెట్టుకున్న లక్ష్యమిది.

మొత్తంగా దేశంలో ఏటా అమ్ముడయ్యే ‘ప్యాకేజ్డ్‌ ప్రొడక్ట్స్‌’ విలువలో ఇది మూడో వంతు. ఇదిలా ఉండగా రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగంగా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద 4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్‌ కంపెనీ అని పతంజలి తెలిపింది.

No comment allowed please