Bhagwant Mann : పంజాబ్ లోని పాటియాలాలో జరిగిన ఘర్షణల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాప్ పోలీసులు బదిలీ అయ్యారు. ఇంటర్నెట్ బ్లాక్ చేశారు. వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్ , ఎస్ఎంఎస్ సేవలు జిల్లాలో ఉదయం నుంచి నిలిపి వేశారు.
సాయంత్రం దాకా కొనసాగుతుందని జిల్లా పరిపాలనా యంత్రాంగం వెల్లడించింది. ఖలిస్తాన్ ముర్దాబాద్ మార్చ్ ను ఒక సంస్థ సభ్యులు ప్రారంభించినప్పుడు ఘర్షణలు చెలరేగాయి.
ఇరు వర్గాల ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఘటనకు బాధ్యత వహిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను పంజాబ్ ప్రభుత్వం పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది.హింసను నియంత్రించడంలో విఫలమైనందుకు పోలీసు శాఖలోని ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేశారు
. జిల్లా ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు (పాటియాలా) , పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, పోలీస్ సూపరింటెండెంట్ లను బదిలీ చేశారు.
ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann )ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. వారిపై వేటు వేశారు. హింసపై పోలీసుల ప్రతిస్పందన తీరు సరిగా లేదంటూ బాధితులు ఆరోపించారు.
కాగా ఐజీ పాటియాలా రేంజ్ గా ముఖ్వీందర్ సింగ్ చిన్నా నియమితులయ్యారు. ఎస్పీగా దీపిక్ పారిక్ ను నియమించినట్లు సీఎంఓ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అన్ని సేవల్ని నిలుపుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇరు వర్గాల ఘర్షణలో ప్రధానంగా పోలీసుల వైఫల్యం నిజమేనని తేలింది. ముందే గుర్తించి కట్టడి చేసి ఉండి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
Also Read : ఊరటనివ్వడం ఉమ్మడి భాద్యత