Pawan Kalyan : జగన్ కరడు గట్టిన క్రిమినల్
టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలి
Pawan Kalyan : రాజమండ్రి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన సీఎం అసలు సిసలైన క్రిమినల్ అని ఆరోపించారు పవన్ కళ్యాణ్.
ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు. ఇచ్చిన ఏ మాట కూడా నిలబెట్టు కోలేదన్నారు. రాష్ట్రాన్ని అధికారం అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నాడని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రతి వీధిలో వైన్ షాపు తెరిచిన ఘనత జగన్ రెడ్డిదని మండిపడ్డారు.
Pawan Kalyan Slams AP CM YS Jagan
గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పరామర్శించారు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాబుతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా చర్చించారు.
దోపిడీలకు పాల్పడుతూ , నేరాలకు పాల్పడే నువ్వు తమను రాకుండా అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. 22 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ ను పట్టుకుంటే దాని మూలాలు ఏపీలో తేలాయన్నారు. దీనిని మీడియా ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు.
వైసీపీని అడ్డుకునేందుకు జనసేన(Janasena), టీడీపీ, బీజేపీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. పాలిటిక్స్ చేసుకుంటూ పోతే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఆధారాలు లేకుండా ఎలా చంద్రబాబును అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప ఇంకొకటి లేదన్నారు.
Also Read : Smita Sabharwal : నాణ్యమైన విద్యుత్ సరఫరా భేష్