Pawan Kalyan : ఎఫ్ఓఏ సంస్థలో ఏపీ ప్రజల డేటా
సంచలన కామెంట్స్ చేసిన పవన్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గడం లేదు. ఆయన మరోసారి ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ రెడ్డిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఎవరి కోసమని ప్రజల డేటా సేకరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న వాలంటీర్లకు పూర్తి వివరాలు ఎందుకు అవసరమని ప్రశ్నించారు.
పోనీ పూర్తిగా సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలి కానీ ఎక్కడో ఏపీకి కాకుండా తెలంగాణలోని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్ఓఏ సంస్థలో ఉండడం ఏమిటి అని జగన్ రెడ్డిని నిలదీశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఏపీలో రెండో విడత వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. పదే పదే జగన్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు జనసేన పార్టీ చీఫ్. ఆంధ్ర పౌరుల మొత్తం డేటా ఇప్పుడు సదరు సంస్థకు ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఆ సంస్థలో ప్రస్తుతం 700 మంది పని చేస్తున్నారని, వారికి వేతనాలు ఎవరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్.
కాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు వైసీపీ మంత్రులు. ఆధారాలు లేకుండా మాట్లాడటం అలవాటుగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో అడ్రస్ లేకుండా చేయడం ఖాయమన్నారు.
Also Read : Elon Musk Modi : భారత్ లో టెస్లా కార్ల తయారీ యూనిట్