Pawan Kalyan : ఎన్నికలకు సిద్దం కావాలి – పవన్
తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం
Pawan Kalyan : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ 119 సీట్లకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మిగతా ప్రతిపక్షాలు సైతం ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అయ్యాయి. కాంగ్రెస్ ఇప్పటికే టికెట్ల కసరత్తుపై ఫోకస్ పెట్టింది. మరో వైపు ఎలాంటి ఫీజు లేక పోవడంతో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.
Pawan Kalyan Comments Sensation
ఈ తరుణంలో అటు ఏపీలో ఇటు తెలంగాణలో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ సైతం ఫోకస్ పెట్టింది. శనివారం ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, బాధ్యులతో సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్బంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు కావాల్సిన సపోర్ట్ పార్టీ పరంగా ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు, నియోజకవర్గాలలో వీలైనంత త్వరగా అభ్యర్థులను జనసేన పార్టీ పరంగా తనకు సూచించాలని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచించారు. ఈ సమావేశంలో పార్టీ చీఫ్ మహేందర్ రెడ్డి , గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ రాజలింగం, తదితరులు హాజరయ్యారు.
Also Read : Ram Gopal Varma : బండారు కామెంట్స్ ఆర్జీవీ సీరియస్