Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీకెండ్ లీడ‌ర్ – నాని

చంద్ర‌బాబు కోసం ప‌వ‌న్ తాప‌త్రయం

Perni Nani : వైసీపీని, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని పంచ్ లు విసిరారు. ఒక ర‌కంగా నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు నాయుడు క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం ప‌వ‌న్ తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రాష్ట్రంలో అంత సీన్ లేద‌న్నారు. ఎవ‌రో రాసి ఇచ్చిన స్క్రిప్టును చ‌దివినంత మాత్రాన ఓట్లు రాల‌వ‌న్నారు. ఆదివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిద‌న్నారు.

వారం వారం వీకెండ్ పార్టీలు చేసుకుంటున్న‌ట్లు పాలిటిక్స్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఓ వీకెండ్ లీడ‌ర్ గా మారి పోయాడ‌ని మండిప‌డ్డారు పేర్ని నాని. ఆరు నూరైనా ఎన్ని కుట్ర‌లు చేసినా వ‌చ్చేది మ‌రోసారి ఏపీలో తామేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. చంద్ర‌బాబు నాయుడు కుటిల రాజ‌కీయాలు జ‌గ‌న్ రెడ్డి ముందు చెల్ల‌వ‌న్నారు.

చాడీలు చెప్పే అల‌వాటు బాబుకు, ప‌వ‌న్ కు ఉంటుంద‌ని కానీ త‌మ‌కు ఉండ‌ద‌న్నారు. తాము ఏమైనా నేరుగా యుద్దం చేసేందుకు ఇష్ట ప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు పేర్ని నాని(Perni Nani). ఏపీ కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం, స‌మాజ అభివృద్ది కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసింది ఏమీ లేద‌న్నారు.

ఉంటే ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని పేర్నినాని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ స్థ‌లంలో నిర్మించిన గోడ‌ల‌ను నోటీసులు ఇచ్చి తొల‌గించార‌ని అక్ర‌మంగా తొల‌గించ లేద‌న్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మాను కోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నాని హెచ్చ‌రించారు.

Also Read : తెగించే వ‌చ్చా తాట తీస్తా – ప‌వ‌న్ కళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!