Pawan Kalyan Kanaka Durga : దుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్
ఇంద్రకీలాద్రిలో వారాహికి పూజలు
Pawan Kalyan Kanaka Durga : పవర్ స్టార్ , జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఆయన వారాహి ప్రత్యేక రథాన్ని తయారు చేయించారు. తాను నిత్యం కొలిచే తెలంగాణలోని కొండగట్టు కొలువైన అంజన్నను దర్శించుకున్నారు. వారాహి ప్రచార రథానికి పూజలు చేయించారు. పూజారుల ఆశీర్వాదం అందుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీలోని బెజవాడ లోని కనకదుర్గమ్మ తల్లి చెంతకు చేరుకున్నారు. అక్కడ అమ్మ వారి దర్శనం చేసుకున్నారు. తన ప్రచార రథానికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు తీర్థం, ప్రసాదం , అమ్మ వారి ఫోటో బహూకరించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తనను కాపాడిన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నానని, తాను నిత్యం ఆరాధించే ఇంద్రకీలాద్రిలో కొలువు తీరిన కనక దుర్గమ్మ ఆశీర్వాదం పొందానని చెప్పారు.
ఇక తాను చేపట్టే ప్రచార రథం బాగుండాలని, ఏపీలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ అమ్మ వారికి పూజలు చేశానని చెప్పారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan Kanaka Durga).
ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు తాను మాట్లాడనని అన్నారు. అయితే పాలిటిక్స్ లో కొత్త నాయకులు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కుటుంబ రాజకీయాలు మంచివి కావన్నారు. ఏపీ ప్రజలు మార్పును కోరుతున్నారని, రాబోయే రోజుల్లో అది వాస్తవ రూపం దాల్చుతుందన్నారు. రాక్షస పాలనను తరిమి కొట్టడమే వారాహి లక్ష్యమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : ఏపీపై ఆప్ ఫోకస్