Pawan Kalyan : పవన్..బాబు కీలక భేటీ
జగన్ సర్కార్ పై యుద్దం
Pawan Kalyan : హైదరాబాద్ – వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి పెళ్లికి ఇటలీ వెళ్లిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ విచ్చేశారు. ఆ వెంటనే హుటా హుటిన ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంటూ ఇటీవలే మధ్యంతర బెయిల్ పై విడుదలై హైదరాబాద్ కు వచ్చిన ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు.
Pawan Kalyan Meet Chandrababu
వీరిద్దరూ దాదాపు 3 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మరికొద్ది మంది కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.
ఈ భేటీలో ప్రధానంగా ఏపీలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డిని ఎలా ఢీకొనాలి, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఎలా పవర్ లోకి రావాలి, అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఎలా అమలు చేయాలనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చర్చించినట్లు సమాచారం.
ఇప్పటికే ఆక్టోపస్ లా ఏపీ అంతటా వైసీపీ విస్తరించింది. ప్రధానంగా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ జైలు ఊచలు లెక్క పెట్టని , తనకు ఎదురే లేదని భావిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించాడు సీఎం వైఎస్ జగన్. మొత్తంగా ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Revanth Reddy Contest : రెండు చోట్ల రేవంత్ రెడ్డి పోటీ