Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్, సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఇప్పటంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సభా ప్రాంగణానికి దివంగత సీఎం దామోదరం సంజీయ చైతన్య వేదికగా నామకరణం చేశారు.
రాజకీయాలలో విభేదాలు ఉండడం సహజమేనని అన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan ). అయితే వ్యక్తిగత ద్వేషాలతో ఎదుటి వారిపై బురద చల్లడం మాను కోవాలని వైసీపీ పార్టీ, నేతలను ఉద్దేశించి హితవు పలికారు.
ప్రత్యర్థి పార్టీని కూడా గౌరవించడం తమ పార్టీకి ఉన్న సంస్కారమని పేర్కొన్నారు. ఒక పార్టీని నడపాలంటే హంగు, ఆర్భాటం ఉండాలా లేక వేల కోట్లు కావాలా అని ప్రశ్నించారు.
పార్టీ నడిపేందుకు కావాల్సింది సిద్దాంతమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుందన్న సత్యాన్ని గుర్తించని వాళ్లే ప్రేలాపనలు చేస్తారంటూ ఎద్దేవా చేశారు.
నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదుర్కోవడమేనని, ప్రశ్నించడం అంటే మార్పునకు నాంది అని తెలుసు కోవాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఏపీని ముంచేశాడంటూ ఆరోపించారు.
ఆనాడు తాము మద్దతు ఇచ్చిన టీడీపి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతినేనని మరోసారి స్పష్టం చేశారు జనసేనాని.
Also Read : రాపాకకు అందని ఆహ్వానం..