Pawan Kalyan : బహుజనుల సంక్షేమం జనసేన లక్ష్యం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : రాష్ట్రంలో కులాల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడదీసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా భీమవరంలో శెట్టి బలిజ, గౌడ నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రత్యేకించి బీసీలను వైసీపీ విడదీసిందని ఆరోపించారు. కానీ జనసేన ఆ పని చేయదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఒకేతాటి పైకి తీసుకు రావడమే తన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు జనసేన పార్టీ చీఫ్.
వైసీపీది ఆనాడు దేశాన్ని ఏలిన ఆంగ్లేయుల పద్దతులను అవలంభిస్తోందని ఆరోపించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). కులాలను ఉప కులాలుగా విభజించి పలుచన చేస్తోందని మండిపడ్డారు. బహుజనుల ఓట్లతో పవర్ లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం కొన్ని కులాలకే ప్రయారిటీ ఇస్తోందంటూ ఆరోపించారు. బీసీల సర్వోముఖాభివృద్దికి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తాము గనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్లు గీత సొసైటీలకు వాటా ఇస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో శెట్టి బలిజ, గౌడ, ఉప కులాలకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో తాటి, ఈత చెట్ల పంపెకం చేపడతామన్నారు.
Also Read : Manipur Victims : రాహుల్ కోసం బాధితుల నిరీక్షణ