Pawan Kalyan : సమస్యలపై జన సేనాని ఫోకస్
అన్ని వర్గాలతో సమాలోచనలు
Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు మరింత రాటు దేలాయి. పవర్ లో ఉన్న వైసీపీ సర్కార్ పై విపక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన అస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రజల తరపున గొంతు పెంచాయి. ఓ వైపు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో బిజీగా ఉంటే మరో వైపు ఆయన తనయుడు నారా లోకేష్ యువ గళంతో జనంతో మమేకయ్యారు.
ఇదిలా ఉండగా జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ఆయన ఏపీపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా ప్రజల మధ్య న ప్రచారం చేసేందుకు గాను వారాహి వాహనాన్ని తయారు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి కొండగట్టుకు వెళ్లారు. అక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. ఇదే సమయంలో వారాహి వాహనానికి పూజలు కూడా నిర్వహించారు.
అనంతరం వారాహి యాత్రకు ఈనెల 14 నుంచి ఏపీలో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పిఠాపురంలో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ వివిధ వర్గాలతో సమావేశం అవుతున్నారు. నిన్న చేనేత కార్మికులను కలుసుకున్నారు. వారి సాదక బాధకాలను విన్నారు. తాజాగా గొల్లప్రోలు లోని సత్య కృష్ణ ఫంక్షన్ హాలులో రైతు, కార్మిక వర్గాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.
Also Read : RS Praveen Kumar : ఇథనాల్ కంపెనీతో ప్రాణాలకు ముప్పు