Pawan Kalyan Kondagattu : అంజ‌న్న స‌న్నిధిలో జ‌న‌సేనాని

వారాహి ప్ర‌చార ర‌థానికి పూజ‌లు

Pawan Kalyan Kondagattu : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంజ‌న్న స‌న్నిధికి చేరుకున్నారు. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేశారు. వారాహి పేరుతో ప్ర‌త్యేక ర‌థాన్ని త‌యారు చేశారు. ఇందు కోసం ఈ ప్ర‌చార ర‌థానికి కొండ‌గ‌ట్టులో కొలువు తీరిన ఆంజ‌నేయ స్వామ ఆశీస్సులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆంజ‌నేయ స్వామి అంటే అభిమానం. ఇందులో భాగంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వారాహికి ఇక్క‌డే పూజ‌లు చేయించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మంగ‌ళవారం భారీ భ‌ద్ర‌త మ‌ధ్య కొండ‌గ‌ట్టుకు(Pawan Kalyan Kondagattu)  చేరుకున్నారు. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరిప్ప‌టి నుంచి ఆల‌యం దాకా అడుగ‌డుగునా పెద్ద ఎత్తున జ‌నం ఆద‌రించారు.

వారాహి ప్ర‌చార ర‌థంతో అంజ‌న్న స‌న్నిధికి చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌య క‌మిటీ సాద‌ర స్వాగ‌తం ప‌లికింది. ఈ సంద‌ర్భంగా వారాహికి పూజ‌లు చేశారు పూజారులు. అనంత‌రం నాచుప‌ల్లి స‌మీపంలోని కోడిమ్యాల మండ‌లం ప‌రిధిలోని బృందావ‌న్ రిసార్ట్ లో తెలంగాణ జ‌న‌సేన నాయ‌కుల‌తో స‌మావేశం కానున్నారు.

భారీ కాన్వాయ్ కార‌ణంగా ఉద‌యం 11 గంట‌ల‌కు చేరుకోవాల్సి ఉండ‌గా ఆల‌స్య‌మైంది. ఎక్క‌డ చూసినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు గ‌జ‌మాల‌ల‌తో స‌త్కారం చేశారు. భారీ ఎత్తున పూలు చ‌ల్లి త‌మ ఆనందం పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ టూర్ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

Also Read : 27 నుంచి బ‌దిలీలు..ప‌దోన్న‌తులు

Leave A Reply

Your Email Id will not be published!