Pawan Kalyan : జ‌గ‌న్ కు ప‌వ‌న్ వార్నింగ్

గొడ‌వ‌లు సృష్టిస్తే ఊరుకోం

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాము నిర్వ‌హించే స‌భ‌ల్లో అల్ల‌ర్లు సృష్టించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు.

వారాహి విజ‌య యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న ప‌లుమార్లు త‌మ‌ను టార్గెట్ చేస్తున్నారంటూ చెబుతూ వ‌చ్చారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ ను ఇక్క‌డికి తీసుకు వ‌స్తే తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Pawan Kalyan Slams CM YS Jagan

ఇదేమైనా జ‌గ‌న్ జాగీరా అని ప్ర‌శ్నించారు. ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపిస్తున్నాడ‌ని ఆవేద‌న చెందారు. ప్ర‌ధానంగా జ‌న‌సేన పార్టీకి(Janasena Party) చెందిన జన సైనికుల‌పై అక్ర‌మంగా కేసులు పెట్టి ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు జ‌న‌సేనాని. వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసి కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తే తాము భ‌య‌ప‌డే వ్య‌క్తులం కామ‌న్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

Also Read : Minister KTR : ఎత్తిపోత‌ల ప‌థ‌కం రైతుల‌కు అంకితం

Leave A Reply

Your Email Id will not be published!