Pawan Kalyan YS Jagan : జగన్ గ్రేట్ అప్పుల్లో రికార్డ్ – పవన్
జనసేన పార్టీ చీఫ్ సెటైర్
Pawan Kalyan YS Jagan : పవర్ స్టార్ , జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పులు చేయడంలో , వాటిని తీసుకు రావడంలో దేశంలోనే ఏపీ సీఎం జగన్ రెడ్డి నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. ఇంత స్పీడ్ గా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన జగన్ కు అప్పు రత్న ఇవ్వాలని పేర్కొన్నారు.
చేస్తున్న అప్పులు ప్రజలకు శాపంగా మారనున్నాయని , భవిష్యత్తులో గనుక మేల్కోక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ . మంగళవారం ఆయన విచిత్రంగా ట్విట్టర్ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుల్లో కొత్త రికార్డు సృష్టించారంటూ ఇక ఎదురే లేదంటూ పేర్కొన్నారు. ఇలా ఎంత కాలం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నెట్టుకు వస్తారంటూ ప్రశ్నించారు.
ప్రజలపై భారం మోపుతూ ప్రజా సంక్షేమం పేరుతో మోసానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వ అప్పులు రూ. 55,555 కోట్లకు చేరుకుందని హెచ్చరించారు. ఇది ఎవరి కోసం , ఎందు కోసం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా అప్పుల పరంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మారు మోగేలా చేస్తున్నందుకు ప్రత్యేకించి సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ది, సంపదను వదిలేసి అప్ప రత్న అవార్డు తీసుకునేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.
Also Read : నెట్టింట్లో సీఎం కేసీఆర్ వైరల్
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023