Pawan Kalyan YS Jagan : ట్యాబ్ లు సరే మరుగుదొడ్ల మాటేంటి
ఏపీ సర్కార్ కు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న
Pawan Kalyan YS Jagan : ఎన్నికల వేళ మాటల తూటాలకు పదును పెట్టారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. శనివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తనకు అమ్మాయిల పిచ్చి ఉందంటూ , నాలుగు ఏళ్లకు ఒకసారి పెళ్లి చేసుకుంటానని సంచలన ఆరోపణలు చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ చీఫ్.
Pawan Kalyan YS Jagan Discussion
పిల్లలకు చదువుకునేందుకు ట్యాబ్ లు ఇస్తున్నారని ,పదే పదే టెక్నాలజీ గురించి గొప్పగా చెబుతున్నారని కానీ రాష్ట్రంలోని బడులలో కనీస సౌకర్యాలు లేవని వాటి గురించి ముందు సీఎం ఫోకస్ పెట్టాలన్నారు. ఇప్పటి వరకుమెగా డీఎస్సీ చేపట్టలేదని ఆరోపించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). టీచర్ రిక్రూట్ మెంట్ లేక పోవడం వల్ల బడుల్లో టీచర్ల కొరత ఏర్పడిందని, దీని వల్ల పిల్లలు చదువుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
మరో వైపు నష్టాలలో ఉన్న స్టార్టప్ కంపెనీ బైజూస్ కు ఎలా, ఏ పద్దతిన కాంట్రాక్ట్ ఇచ్చారో ప్రజలకు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన టెండర్ పిలిచిందని, ఆ సంస్థకే ఎందుకు కట్టబెట్టిందో చెప్పాలని నిలదీశారు. టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఎవరు షార్ట్ లిస్టు చేశారో చెప్పాలని అన్నారు. ముఖ్యంగా పబ్లిక్ డొమైన్ లో ఉందా అని నిలదీశారు.
Also Read : TTD Sabha Parvam : జూలై 23న ముగియనున్న సభా పర్వం