Pawan Khera : మోదీ మౌనం దేనికి సంకేతం – కాంగ్రెస్

కామెంట్స్ క‌ల‌క‌లంపై ప‌వ‌న్ ఖేరా

Pawan Khera : భార‌తీయ జ‌న‌తా పార్టీని, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. నిన్న‌టి దాకా త‌మ పార్టీని, నేత‌ల‌ను దూషించినా తాము దేశం కోసం మౌనంగా ఉన్నామ‌ని కానీ బీజేపీ నేత‌లు చేసిన చౌక‌బారు కామెంట్స్ వ‌ల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే ప్ర‌మాదం నెల‌కొంద‌న్నారు.

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ స్పోక్స్ ప‌ర్సన్ నూపుర్ శ‌ర్మ‌, మీడియా ఇన్ ఛార్జ్ న‌వీన్ జిందాల్ . వీరిద్ద‌రినీ పార్టీ నుంచి తొల‌గించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

కానీ వారు చేసిన వ్యాఖ్య‌లు అగ్గిని రాజేశాయి. దేశ వ్యాప్తంగా , ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అర‌బ్, ముస్లిం దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి భార‌త్ పై.

కొన్ని కంట్రీస్ లో ఏకంగా భార‌త్ త‌యారు చేసిన ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌ను నిలిపి వేశాయి. ఇంకొన్ని దేశాలు ఐక్య‌రాజ్య స‌మితికి లేఖ‌లు రాశాయి.

ఇంకొన్ని భార‌త దేశం త‌ప్ప‌నిస‌రిగా క్ష‌మాప‌ణాలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ అయ్యింది. దేశం ప‌రువును గంగ‌లో క‌లిపేశారంటూ ఆరోపించింది.

గ‌త వారం రోజుల్లో దేశానికి ప‌లు చోట్ల అవ‌మానం జ‌రిగిందంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌వ‌న్ ఖేరా. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ , కేంద్రం మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని కూడా మ‌రిచి పోయార‌ని ఎద్దేవా చేశారు. విద్వేష పూరిత‌మైన ప్ర‌సంగాల‌పై ప్ర‌ధాన మంత్రి మోదీ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు ప‌వ‌న్ ఖేరా(Pawan Khera).

Also Read : డాక్ట‌ర్ల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడొద్దు – సుప్రీం

Leave A Reply

Your Email Id will not be published!