Pawan Khera Stopped : పవన్ ఖేరాకు నిరసన సెగ
పీఎంపై కామెంట్స్ తో ఆగ్రహం
Pawan Khera Stopped : దేశ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన తండ్రి పట్ల చులకనగా కామెంట్స్ చేశారంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాపై(Pawan Khera) మండిపడింది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఆయన ఛత్తీస్ గఢ్ లో మూడు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఆయన వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
అయితే పవన్ ఖేరాను ఎయిర్ పోర్ట్ లో వెళ్లనీయకుండా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయంటూ(Pawan Khera Stopped) కాంగ్రెస్ పార్టీ గురువారం ఆరోపించింది. అంతే కాకుండా ఆయనను నిర్బంధించేందుకు యత్నించారంటూ మండిపడింది. ఈ మొత్తం వ్యవహారంపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత రాయ్ పూర్ కు వెళ్లాలని ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆయన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కీలకమైన మీటింగ్ ఉండడంతో పవన్ ఖేరా తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఇండియన్ ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన చేసింది. పవన్ ఖేరాను రాయ్ పూర్ కు వెళ్ల వద్దని క్లియర్ గా తమకు ఆదేశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం మంచి పద్దతి కాదని సూచించింది.
Also Read : సంజయ్ రౌత్ పై పరువు నష్టం దావా