Pawan Khera : ఎలక్టోరల్ బాండ్ స్కీం బక్వాస్
కేంద్రానికి అనుకూలం - కాంగ్రెస్
Pawan Khera : ఎలక్టోరల్ బాండ్ స్కీంపై సంచలన కామెంట్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది పూర్తిగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి దానిని సపోర్ట్ చేస్తున్న పార్టీలకు మేలు చేకూర్చేలా రూపొందించారంటూ ఆరోపించారు ఆ పార్టీ నేత ఖేరా. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ఇటీవల రాయ్ పూర్ లో జరిగిన 85వ ప్లీనరీ సమావేశంలో ఎలక్టోరల్ బాండ్ స్కీంను రద్దు చేస్తామని ప్రకటించామన్నారు. తాము గనుక అధికారంలోకి వస్తే వెంటనే ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు పవన్ ఖేరా.
ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. 2016-17 నుండి 2021-22 మధ్య బీజేపీకి రూ. 5,271.97 కోట్లు విరాళాల రూపేణా వచ్చాయని ఆరోపించారు. ఇవన్నీ ఎవరు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క బీజేపీకి అన్ని వస్తే మిగతా జాతీయ పార్టీలకు రూ. 1,783.93 కోట్లు విరాళాలు వచ్చాయని ఇదెలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
ఏడీఎఫ్ ఈ విషయాన్ని వెల్లడించిందని గుర్తు చేశారు. పవన్ ఖేరా(Pawan Khera) శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ వివాదాస్పద అవినీతికి పరాకాష్ట ఎన్నికల బాండ్ల పథకం అని పేర్కొన్నారు. ఇది నల్ల ధనాన్ని తెల్లగా మార్చే మనీ వైట్నింగ్ స్కీం అంటూ ఎద్దేవా చేశారు పవన్ ఖేరా.
Also Read : TDP Maha Shakti : మహాశక్తికి టీడీపీ శ్రీకారం – చంద్రబాబు